Halloween Costume ideas 2015
Articles by "Movie-News"

4:20:00 PM


ఇటీవల డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫిలిం ఛాంబర్ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పిన విదానాన్ని ఆయన తప్పుపట్టారు.  ఫిల్మ్ ఛాంబర్ కి నా బహిరంగ లేఖ అంటూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ' సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం, డ్రగ్ స్కాండల్ కాదు..ఆ డ్రగ్ స్కాండల్ కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా  అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం

ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేసామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు  చెప్పడం గాని ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు? అపాలజీ లెటర్ లో ఒక వాక్యం "అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం"- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేసారో?

అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రెడీ నేరం ఋజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థం ఏమిటి?

అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం "మీలో ఏ మాత్రం పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా,జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలి. విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైనది కావచ్చేమో కానీ, అసలు చార్జెస్ కూడా ఫైల్ అవ్వని ఇలాంటి సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ వుంది. ఒకవేళ అలా మాట్లాడడం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి, అన్యాయంగా కేసులు బనాయించి చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం".
అలాగే రేపు ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ కి ఏ మాత్రం విచక్షణ వున్నా అధికారులకి బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే  ఆరోపణలు ఎదుర్కున్న వాళ్లందరికీ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ  చెప్పాలి. ఇలా చెయ్యని పక్షంలో భావి చరిత్రలో వీళ్లందరూ నిజంగా నేరస్థులేనని... కాని ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణ మూలానే క్షమించి వదిలేసారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుంది..ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని గౌరవపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను.' అంటూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు వర్మ.

                                                                                                                                     Source:Sakshi




‘‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే, ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’’ అంటున్నారు వరుణ్‌తేజ్‌. ఈ ‘మిస్టర్‌’ను ఎవరి ప్రేమ వెతుక్కుంటూ వచ్చిందో చెప్పమంటే ఏప్రిల్‌ వరకూ ఎదురు చూడమంటున్నారు. వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధులు నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్‌’. లావణ్యా త్రిపాఠీ, హెబ్బా పటేల్‌ హీరోయిన్లు. కొత్త ఏడాది కానుకగా వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌ లుక్, సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘వరుణ్‌తేజ్‌ స్థాయి పెంచే చిత్రమిది. 80 శాతం సినిమా పూర్తయింది. రెండు పాటలు, క్లైమాక్స్‌ చిత్రీకరించాల్సి ఉంది.


ఏప్రిల్‌ 14న చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనేది ప్లాన్‌’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘నా కెరీర్‌లో స్పెషల్‌ ఫిల్మ్‌ ఇది. ఎమోషన్స్, విజువల్స్, మ్యూజిక్‌లకు స్కోప్‌ ఉన్న కథ. స్పెయిన్, స్విట్జర్లాండ్, ఇండియా లోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం’’ అని శ్రీను వైట్ల అన్నారు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్‌ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమేరా: కేవీ గుహన్, సై్టలింగ్‌: రూపా వైట్ల.

5:49:00 PM





Watch & Enjoy Shatamanam Bhavati Audio Launch Live, Starring Sharwanand, Anupama Parameshwaran, Prakash Raj, Jayasudha, Music by Mickey J Meyer. Produced by Dil Raju and Directed by Vegesna Satish.


Movie Name : Shatamanam Bhavati
Banner : Sri Venkateswara Creations
Producer : Dil Raju
Director : Vegesna Satish
Music Director : Mickey J Meyer
Actor : Sharwanand
Actress : Anupama Parameshwaran
Lable : Aditya Music

11:07:00 AM



స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ (2009)కి జంట ఆస్కార్‌ అవార్డులు అందుకున్న సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ అప్పటి నుంచి ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఆ తర్వాత  రెండేళ్లకు ‘127 హవర్స్‌’ చిత్రానికిగాను ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’, ‘బెస్ట్‌ ఒరిజినల్‌ మ్యూజిక్‌ స్కోర్‌’ విభాగాల్లో నామినేషన్‌ దక్కించుకున్నారాయన. అయితే ఆస్కార్‌ వరించలేదు. తాజాగా మళ్లీ ఆయన ఆస్కార్‌ బరిలో నిలిచారు.

బ్రెజిల్‌ దేశానికి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ ఆటగాడు పీలే జీవితం ఆధారంగా రూపొందిన ‘పీలే: బర్త్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ చిత్రానికి గాను రెహమాన్‌ ఆస్కార్‌ రేస్‌లో ఉన్నారు. ఒరిజినల్‌ మ్యూజిక్‌ స్కోర్, ఒరిజినల్‌ సాంగ్‌ విభాగాల్లో రెహమాన్‌ పోటీపడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఆస్కార్‌ అవార్డుల వేడుక జరుగుతుంది. జనవరి 24న నామినేషన్‌ దక్కించుకున్నవారి వివరాలను ప్రకటిస్తారు. మరి.. ఈ నామినేషన్‌ ఎంట్రీ పోటీలో రెహమాన్‌కి స్థానం దక్కుతుందా? నామినేషన్‌ గెల్చుకుంటే ఆస్కార్‌ దక్కించుకుంటారా? అనేది వేచి చూడాలి.

సోర్స్ : సాక్షి దినపత్రిక

6:10:00 PM


బాణంతో హీరోగా తెరంగేట్రం చేసిన నారా రోహిత్ తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో అలరిస్తున్నాడు.  ప్రతినిధి, సోలో, రౌడీఫెలో, జ్యో అచ్యుతానంద లాంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  తాజాగా నారా రోహిత్ న‌టించిన మ‌రో విల‌క్షణ చిత్రం `అప్పట్లో ఒక‌డుండేవాడు`. నారా రోహిత్‌, శ్రీ విష్ణు, తాన్యా హోప్ హీరో హీరోయిన్లుగా  నారారోహిత్ స‌మ‌ర్పణ‌లో ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

నారా రోహిత్ ముస్లిం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరో శ్రీ విష్ణు క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఒకే సమయంలో 90వ దశకం కథతో పాటు ప్రస్తుత కథ కూడా నడిచేలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. యు/ఎ సర్టిఫికేట్ తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

source :సాక్షి దినపత్రిక

5:48:00 PM
 

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఖైదీ నంబర్ 150 షూటింగ్ పూర్తయ్యింది. దాదాపు దశాబ్దకాలంగా మెగా అభిమానులను ఊరిస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరు మార్క్ మాస్ యాక్షన్ కామెడీలతో రూపొందిన ఈ సినిమా మెగాస్టార్ స్టామినాను మరో సారి ప్రూవ్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయ్యింది. ఈ విషయాన్ని మెగాతనయ, ఖైదీ నంబర్ 150 కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మితా కొణిదల స్వయంగా ప్రకటించారు. తన ట్విట్టర్ పేజ్ లో ఖైదీ నంబర్ 150 షూటింగ్ పూర్తయ్యిందంటూ పోస్ట్ చేసిన సుస్మిత, రత్నవేళు, వినాయక్, దేవీ శ్రీ ప్రసాద్ లతో కలిసి పనిచేయటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో యూనిట్ సభ్యుల నుంచి ఎంతో నేర్చుకున్నానంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది సుస్మిత.

Source : సాక్షి దినపత్రిక

10:56:00 AM



యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ బర్త్ డేని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ ఆడియోను అభయ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జనతా గ్యారేజ్ యూనిట్.

గత ఏడాది అభయ్ పుట్టిన రోజున ఎన్టీఆర్ లండన్ లో ఉన్నారు. అభయ్ ను తన దగ్గరకే పిలిపించుకొని బర్త్ డే పార్టీని ఏర్పాటు చేసినా అభిమానుల సమక్షంలో ఆ వేడుకను నిర్వహించలేకపోయారని ఫీల్ అయ్యాడు జూనియర్. అందుకే ఈ బర్త్ డేను అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకతో పాటు భారీ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాడు.

7:58:00 PM


ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ గురువారం రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది.
రవితేజ నటిస్తున్న ఈ సినిమాలోని సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు క్లాప్ కొట్టారు. సినీ సంభాషణల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు  కెమెరా స్విచాన్ చేశారు. అలాగే తొలిషాట్ కు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో కాళహస్తి చిత్రం ద్వారా గంటా రవితేజ తెరంగేట్రం చేస్తున్నారు.


7:42:00 AM
 

నందమూరి బాలకృష్ణ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ వచ్చే నెల 2 నుండి మొదలు కానున్నట్టు సమాచారం. 22 రోజుల పాటు జార్జియాలో జరుగనున్న ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ వచ్చే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇదంతా చూస్తుంటే అన్నిటికంటే ముందు యుద్ధ సన్నివేశాలను పూర్తి చేసేందుకే దర్శకుడు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. మొరాకోలో జరిగిన తొలి షెడ్యూల్‌లో 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు సహా 200 గుర్రాలతో కొన్ని యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన క్రిష్ హైదరాబాద్‌లో జరిగిన తర్వాతి షెడ్యూల్లోనూ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో మరి కొన్ని యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. ఇక తర్వాతి షెడ్యూల్‌ను వాటికే కేటాయించారు. ‘బాహుబలి’ తర్వాత యుద్ధ నేపథ్యంలో వస్తున్న సినిమా గనక ఆ స్థాయికి తక్కువ కాకుండా క్రిష్ జాగ్రత్త వహిస్తున్నారట. బాలయ్య వందో చిత్రంగా రానున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

1:23:00 PM

 

లైలా తన లుక్‌తో అభిమానుల గుండెల్లో హీట్ పెంచేశారు. ఇంతకీ ఈ లైలా ఎవరో తెలిసే ఉంటుంది. తెలుగు చిత్రం ‘ఒక లైలా కోసం’లో నాగచైతన్య ప్రేయసి  లైలాగా కుర్రకారు గుండెలను దోచేసిన పూజా హెగ్డే ఆ తర్వాత ‘ముకుంద’ చిత్రంలో నటించారు. హిందీలో తొలి చిత్రం ‘మొహంజదారో’ విడుదల కాక ముందే ఆ చిత్రంలోని లుక్‌తో బాలీవుడ్‌ను తన వైపు తిప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమెకు ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా...? ఒకే ఒక్క యాడ్‌తోనే ఆమె ఈ బంపర్ ఆఫర్ కొట్టేశారు.

సినిమాల్లోకి రాకముందు పూజ చే సిన యాడ్ ‘మొహంజదారో’ టీమ్ దృష్టిలో పడింది. అంతే.. ఆ భారీ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ చాన్స్ వచ్చేసింది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.హృతిక్ ప్రేయసి చానీగా పూజ ఇందులో నటిస్తున్నారు.  గురువారం విడుదల చేసిన చానీ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు ‘చానీ.. లుకింగ్ సో చార్మింగ్’ అని పూజాని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయాలనుకుంటున్నారు.

1:15:00 PM
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు ఎస్ జే సూర్య. నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి కావచ్చింది.

అయితే ఈసినిమా ప్రారంభం అయిన సమయంలో హుషారు అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను చేస్తున్నట్టుగా తెలిపారు. అది ఫైనల్ టైటిల్ కాదని త్వరలోనే టైటిల్ వెల్లడిస్తామన్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. చిత్ర నిర్మాత శరత్ మరార్ ఫిలిం ఛాంబర్ లో కడప కింగ్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు.

అయితే ఇదే పవన్ సినిమా టైటిల్ అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లా తెల్ల బట్టల్లో కనిపించటం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. నిజంగానే పవన్ సినిమా టైటిల్ కడప కింగా కాదా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

9:16:00 AM
ఒక్క అమ్మాయి తప్ప సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్, గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. తొలిసారిగా కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ తో కలిసి నక్షత్రం సినిమాలో నటిస్తున్నాడు సందీప్. బుధవారం ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజునే యాక్షన్ సీన్స్ షూటింగ్ ప్రారంభించగా.. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో సందీప్ తలకు బలమైన గాయం తగలడంతో యూనిట్ సభ్యులు వెంటనే అతన్ని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన పై స్పందించిన హీరో సందీప్ కిషన్ 'ఇప్పుడు బాగానే ఉంది. కొన్ని కుట్లు పడ్డాయి. కృష్ణవంశీ గారి సెట్ లో యాక్షన్ సీన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కానీ సీన్ చాలా బాగా వచ్చినందకు ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు.

5:08:00 PM
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి హీరో ఎవరు? దిల్‌ రాజు, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో నటించే గోల్డెన్ చాన్స్ ఎవరికి దక్కుతుంది? ప్రస్తుతం ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. 'అ.. ఆ' సినిమా విజయంతో మంచి ఊపుమీదున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌ను హీరోగా తీసుకోవచ్చన్నది టాలీవుడ్ టాక్. ఇప్పటికే పవన్ కల్యాణ్, మహేశ్ బాబులతో రెండేసి సార్లు పనిచేసిన ఈ స్టార్ డైరెక్టర్.. ఈసారి వాళ్లు కాక మరో కొత్త హీరోతో చేయాలని భావిస్తున్నాడట. అందుకే తాను ఇప్పటివరకు పనిచేయని చెర్రీ లేదా తారక్‌లలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రామ్‌చరణ్ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమా రీమేక్ 'ధ్రువ'లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసేస్తున్నాడు. త్రివిక్రమ్ తన కొత్త సినిమా కథ చెప్పగానే ఎన్టీఆర్ బాగా థ్రిల్లైపోయి.. వెంటనే సరేనన్నాడని కూడా వినిపిస్తోంది. కొన్ని వారాల్లోనే హీరో ఎవరన్నది ఫైనలైజ్ అవుతుందని, ఇక వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.




Published on Jun 12, 2016
'దేవదాస్' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యి ఆ తరువాత 'పోకిరి' చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇలియానా. ఆ తరువాత వరుసపెట్టి స్టార్ హీరోల పక్కన నటించడమే కాకుండా టాలీవుడ్ లో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ గా ఇలియానా రికార్డు సృష్టించింది. అయితే ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశం రావడంతో అక్కడికి మఖాం మార్చేసింది. అయితే అక్కడ మంచి మంచి సినిమాలు చేసినా అమ్మడుకి సరైన అవకాశాలు రాలేదు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఒక చారిటీ ఫంక్షన్ కి ముఖ్యఅతిధిగా వెళ్ళింది.

అయితే లోపలి వెళ్ళేటప్పుడు ఆమె షర్టు విప్పేసి నడుముకి కట్టుకుని వెళ్ళింది. ఇది చూసిన వారు ఇలియానా ని కళ్ళార్పకుండా చూసారు. ఆ డ్రెస్ లో ఇలియానా ఎంతో సెక్సీగా ఉంది. మొత్తం మీద తన మతిపోయే ఫిగర్ తో మరోసారి అందరినీ కట్టి పడేసింది. ఇలియానా ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన 'రుస్తుం' అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో టూ పీస్ బికినీ వేసి అందరినీ పిచ్చెక్కించబోతుంది. అంతే కాదు ఇందులో విపరీతమైన హాట్ హాట్ సన్నివేశాలు ఉన్నాయట. అవకాశాలు కోసం ఇలియానా ఇంక అందాల ఆరబోతకు మరింత రెచ్చిపోయి గేట్లు ఎత్తేసిందని బాలీవుడ్ టాక్..

MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget