Halloween Costume ideas 2015
Articles by "NEWS"

6:45:00 PM
Facebook-introduces-Messenger-Rooms
Facebook-introduces-Messenger-Rooms



COVID-19 సంక్షోభం వీడియో కాన్ఫరెన్సింగ్ అనువర్తనాలను బాగా ప్రాచుర్యం పొందింది. మైక్రోసాఫ్ట్ జట్లు, గూగుల్ మీట్, జూమ్ లేదా హౌస్‌పార్టీ వంటి సాధారణ ప్రజలకు తెలియని అనువర్తనాలు కొన్ని వారాల్లో వారి వినియోగదారుల సంఖ్య పేలడం చూసింది. ఉదాహరణకు, డిసెంబరులో రోజుకు 10 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులు లేని జూమ్ ఇప్పుడు 300 మిలియన్లను కలిగి ఉంది. హౌస్‌పార్టీ, ఒక నెలలో 50 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను నమోదు చేసింది.


ఈ రోజు, ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగించగల వీడియో కాన్ఫరెన్సింగ్ సాధనాల జాబితాకు కొత్త ఫేస్బుక్ సేవ జోడించబడింది: మెసెంజర్ రూములు. ఈ వారం ప్రకటించిన, రూములు 50 మంది పాల్గొనేవారిని ఆహ్వానిస్తాయి. ఈ సేవ మెసెంజర్ అనువర్తనానికి అనుసంధానించబడింది, దీని నుండి వినియోగదారు వీడియోకాన్ఫరెన్స్ ప్రారంభించవచ్చు.

మీరు వీడియోకాన్ఫరెన్స్‌ను సృష్టించిన తర్వాత, ఫేస్‌బుక్‌లో న్యూస్ ఫీడ్, గ్రూపులు లేదా ఈవెంట్‌ల ద్వారా లేదా ఫేస్‌బుక్ ఖాతాలు లేని వ్యక్తుల కోసం లింక్‌ను పంచుకోవడం ద్వారా దీన్ని చేరడానికి ఆహ్వానాన్ని పంచుకోవచ్చు. త్వరలో, వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ నుండి సమూహ సంభాషణను ప్రారంభించడం కూడా సాధ్యమవుతుంది.


Facebook-introduces-Messenger-Rooms
Facebook-introduces-Messenger-Rooms

ఇతర వీడియోకాన్ఫరెన్సింగ్ సేవలు వృత్తిపరమైన ఉపయోగం కోసం రూపొందించబడి ఉంటే, ఫేస్బుక్ సాధారణ ప్రజలను గదులతో లక్ష్యంగా చేసుకుంటుంది. “మీకు గదికి ఆహ్వానం వచ్చినప్పుడు, మీరు మీ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి చేరవచ్చు. ప్రారంభించడానికి మీరు ఏదైనా డౌన్‌లోడ్ చేయనవసరం లేదు ”అని సోషల్ మీడియా నాయకుడు చెప్పారు.

గోప్యతకు సంబంధించి, ఫేస్బుక్ భరోసా ఇస్తుంది. ఒక బ్లాగ్ పోస్ట్‌లో, నంబర్ వన్ సోషల్ నెట్‌వర్క్ వివరిస్తుంది. “మీరు ఫేస్‌బుక్ లేదా మెసెంజర్ ద్వారా గదిలో చేరినప్పుడు, మీరు ఫేస్‌బుక్‌లో స్నేహితులు కాని పాల్గొనేవారు మీరు చెప్పే లేదా గదిలో పంచుకునే ప్రతిదాన్ని చూడగలరు మరియు వినగలరు, కాని వారికి మీ ప్రొఫైల్ లేదా సమాచారానికి మంచి ప్రాప్యత ఉండదు. ఫేస్బుక్ యొక్క ఇతర భాగాలు. వారు మీ పబ్లిక్ ఫేస్బుక్ ప్రొఫైల్ నుండి మీ పేరు మరియు సమాచారం వంటి సమాచారాన్ని మాత్రమే చూడగలరు. మీరు బహిరంగంగా ప్రచురించిన వాటికి లేదా మీరు ఇద్దరూ చేరిన సమూహం యొక్క కంటెంట్‌తో పాటు ”. ప్రకటనలను లక్ష్యంగా చేసుకోవడానికి రూమ్‌లపై ఆడియో మరియు వీడియో సంభాషణలు ఉపయోగంలో ఉండవని కంపెనీ నిర్ధారిస్తుంది.

ఈ వారంలో “కొన్ని దేశాలలో” గదులు ప్రారంభించబడతాయి మరియు రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.

6:47:00 AM

కేబినెట్‌ నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్‌ గురించి ప్రశ్నించడానికి లక్ష్మీనారాయణ నన్ను దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లోని తన ఏసీ గదిలో కూర్చోబెట్టారు. 48 ఫైళ్లు నా ముందుంచారు. ‘మీరు సంతకం చేశారు, ఇలా నోట్‌ వచ్చినప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు’ అని అడిగారు. అప్పుడు నాకు తెలిసిందేమిటంటే.. రాష్ట్రంలో సెక్రటేరియెట్‌ రూల్స్, పద్ధతులు సీబీఐ వాళ్లకు తెలియవు. బేసిక్‌గా అది ఒక ప్రాబ్లమ్‌. కేబినెట్‌ సమావేశం అంటే ఏమిటి? ఏ పరిస్థితుల్లో కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తారు..? ఒక కేబినెట్‌కు ఒక సబ్జెక్టు ఎందుకు పంపిస్తాం..? కేబినెట్‌ పరిధి ఏమిటి..? ముఖ్యమంత్రికి గల అధికారాలేమిటి? కేబినెట్‌లో నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి? అనే విషయాలు సీబీఐకి నిజంగా తెలియదు.

వాళ్లకు (సీబీఐ) భారత ప్రభుత్వ రూల్సే తెలుసు కాని రాష్ట్ర ప్రభుత్వ రూల్స్‌ తెలియవు. అసెంబ్లీ నిబంధనలు తెలియవు. స్పీకర్‌కు, ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలేమిటో తెలియవు. మాలాంటి కార్యదర్శులకు ఉన్న అధికారులు, విధులు, బాధ్యతలు ఏమిటో వారికి తెలియవు. అవి తెలియజెప్పడానికి నాకు ఒకరోజు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గం ఎలా పని చేస్తుందో సీబీఐకి తెలియజెప్పే పనిని సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ)లో పనిచేసే ఓ మహిళా అధికారికి అప్పగించాం. ఆమె ఆ పని చేశారు. నాకు బేసిక్‌గా తెలిసింది ఏమిటంటే.. అసలు స్టేట్‌ గవర్నమెంట్‌ రూల్స్, ప్రొసీజర్స్‌ను కూడా అర్థం చేసుకోకుండా సీబీఐ వాళ్లు విచారణ మొదలుపెట్టారు. నేను ఆరోజే ఆయన (లక్ష్మీనారాయణ)ను ఈ కేసులు నిలుస్తాయని నిజంగా మీకు నమ్మకం ఉందా..? అని అడిగితే... సమాధానం ఏమీ చెప్పకుండా నవ్వేశారాయన.  

                                                                                                                                  సోర్స్  : సాక్షి దినపత్రిక

11:22:00 AM

‘‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులను కొని, నష్టపోయా. పవన్‌ కల్యాణ్‌ తర్వాతి చిత్రం ‘కాటమరాయుడు’ పంపిణీ హక్కులు ఇస్తామని చెప్పిన నిర్మాత శరత్‌ మరార్, పవన్‌ కల్యాణ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ ఇప్పుడు స్పందించక పోగా, బెదిరిస్తున్నారు’’ అని డిస్ట్రిబ్యూటర్‌ సంపత్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను పవన్‌ కల్యాణ్‌గారి అభిమాని. చిన్న సినిమాలు పంపిణీ చేసుకునే నేను ఆయన పై ఉన్న అభిమానంతో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ కృష్ణాజిల్లా హక్కులు కొనేందుకు రాగా, శరత్‌ మరార్‌గారు, శ్రీనివాస్‌గారు నాలుగు కోట్ల యాభై లక్షలు చెప్పారు.

‘గబ్బర్‌ సింగ్‌’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలకు కృష్ణా జిల్లాలో 3 కోట్ల 50 లక్షల షేర్‌ వచ్చింది, ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు, అందులో కొంచెం రికవరీ అమౌంట్‌ పెట్టమని చెప్పా. సినిమా బాగా వచ్చింది, హిట్‌ కొడతామనీ.. మన వద్ద రామ్‌చరణ్, సాయిధరమ్‌ తేజ్‌ చిత్రాలు కూడా ఉన్నాయని, ఏం భయం లేదనీ అన్నారు. ఆ మాటలు నమ్మి నాలుగు కోట్ల ముప్ఫైఎనిమిది లక్షలు (నాన్‌ రిటర్నింగ్‌ అమౌంట్‌) శరత్‌ మరార్‌కు ఇచ్చా. కృష్ణా జిల్లాలో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ టోటల్‌ షేర్‌ 2 కోట్ల 52 లక్షలు రాగా, కోటీ ఎనభై ఆరు లక్షల నష్టం వచ్చింది. సేమ్‌ బ్యానర్‌లో మరో చిత్రం చేసి, నష్టపోయిన బయ్యర్లకే పంపిణీ హక్కులిచ్చి న్యాయం చేస్తామని చెప్పి ‘కాటమరాయుడు’ స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ‘ఇవ్వం’ అని, వేరే వారికి పంపిణీ హక్కులు ఇస్తున్నారు.

ఈ విషయాన్ని పవన్‌గారి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయమని అడుగుదామనుకుంటే శరత్‌ మరార్, శ్రీనివాస్‌ నన్ను కలవనివ్వడం లేదు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ ‘నీ అంతు చూస్తాం’ అని బెదిరించాడు. నాకే కాదు, నైజాం డిస్ట్రిబ్యూటర్‌కు కూడా 8 కోట్ల నష్టం వచ్చింది. ఆయనకూ సినిమా ఇవ్వం అంటున్నారు. కల్యాణ్‌గారికి ఇవేవీ తెలియవు. తెలిసుంటే న్యాయం చేసేవారు. మీడియా ద్వారా ఆయన దృష్టికి వెళితే, నష్టపోయిన నాలాంటి వారికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.

                                                                                                                             సోర్స్ : సాక్షి దినపత్రిక

11:45:00 AM


వైఎస్సార్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వకపోతే అక్కడ అభివృద్ధి పనులు చేయలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడ శేషసాయి కల్యాణ మండపంలో సోమవారం వైఎస్సార్‌ జిల్లా టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఈ సమావేశంలో కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలా గెలుచుకోవాలనే అంశంపై చర్చించారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఒక్క వైఎస్సార్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పోయినా తనకు వచ్చే ఇబ్బంది లేదని, కానీ అభివృద్ధి కావాలంటే తనను బలపరచా లన్నారు. సమావేశంలో కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేష్, జిల్లా నేతలు పాల్గొన్నారు.

12:40:00 PM

అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరి, 74 రోజుల చికిత్స అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్‌ 5న కన్నుమూశారు. అయితే ఆమె అందించిన చికిత్సపై సొంత పార్టీ ఏఐడీఎంకేలోని కొందరు నాయకులు సహా ప్రతిపక్ష డీఎంకే సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎంకే చీఫ్‌ కరుణానిధైతే ఒక అడుగు ముందుకేసి జయ ఫొటోలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ ఎలాంటి ఫొటోలు విడుదలకాకుండానే జయ పరమపదించారు. ఆమె మరణానంతరం చికిత్సకు సంబంధించిన కొన్ని వివరాలను ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ కొంతమంది ఈ విషయంపై మాట్లాడుతూనేఉన్నారు. అలాంటివాళ్లందరికీ సమాధానంగా జయకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రుల చైర్మన్‌ ప్రతాప్‌.సి.రెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రతాప్‌ సి రెడ్డి అన్నారు. శుక్రవారం చైన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొని, ప్రసంగించిన ఆయన.. విచారణ జరిపితేగనుక, మాజీ సీఎం మరణానికి సంబంధించిన అన్నివివరాలను అందజేస్తామని చెప్పారు. ఈ విషయంలో దాగుడుమూతలకు తావులేదని తెలిపారు. తాను మొదటి నుంచి చెపుతున్నట్లే.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత గుండెపోటుకు గురికావడం వల్లే జయ చనిపోయారని మరోసారి స్పష్టంచేశారు. చికిత్సలో భాగంగా జయలలిత కాళ్లు తొలిగించారనే వార్తలు నిజం కావని ప్రతాప్‌.సి.రెడ్డి పేర్కొన్నారు.

                                                                                                                               Source :  సాక్షి దినపత్రిక

11:57:00 AM

ఉత్తమ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీని ప్రకటించిన యూనెస్కో


 దేశంలో హల్ చల్ చేసిన చాలా బూటకపు కథనాలకు మూలంగా నిలిచింది ఐక్యరాజ్యసమితికి చెందిన సాంస్కృతిక సంస్థ యూనెస్కో. గత జూన్ లో ఈ బూటకపు కథనం వెలుగుచూసింది. సోషల్ మీడియాలో, వాట్సాప్ లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఇప్పటికే మోదీకి బెస్ట్ పీఎంగా యూనెస్కో పురస్కారం అందిందన్న బూటకపు వార్త వాట్సాప్ లో చక్కర్లు కొడుతూనే ఉంది.




ఉత్తమ జాతీయగీతంగా 'జనగణమన'ను ఎంపిక చేసిన యూనెస్కో


 ఈ ఫేక్ కథనం కూడా వాట్సాప్ యూజర్లు ప్రతి ఒక్కరికీ చేరి ఉంటుంది. ప్రపంచంలోనే ఉత్తమ జాతీయగీతంగా 'జనగణమన'ను యూనెస్కో ప్రకటించిందంటూ ఈ కథనం 2008 నుంచి ఈమెయిళ్లలో చక్కర్లు కొడుతోంది. అప్పట్లోనే యూనెస్కో స్పందించింది. దేశంలోని పలు బ్లాగుల్లో ప్రచురించినట్టు భారత జాతీయగీతం గురించిగానీ, ఇతర దేశం గురించిగానీ తాము ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టత ఇచ్చింది. అయినా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ న్యూస్ విపరీతంగా చక్కర్లు కొట్టింది.  

ప్రపంచంలోనే ఉత్తమ కరెన్సీగా రూ. 2000 నోటును ప్రకటించిన యూనెస్కో


 నోట్ల రద్దు సంక్షోభంతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో చక్కర్లు కొట్టిన మరో ఫేక్ న్యూస్ ఇది. రూ. 2000 నోటును యూనెస్కో ఉత్తమ కరెన్సీగా ప్రకటించిందంటూ వాట్సాప్ లో విపరీతంగా వ్యాప్తి చెందింది ఈ కథనం. విశేషమేమిటంటే ఏకంగా బీబీసీ కూడా ఈ వదంతి గురించి స్పందించి ఓ కథనాన్ని ఇచ్చింది. భారతీయులు మరీ మురిసిపోతూ ఈ ఫేక్ కథనాన్ని షేర్ చేసుకుంటున్నారని పేర్కొంది.

కొత్త నోట్లలో జీపీఎస్ చిప్.. నల్లధనానికి చెక్!




 నవంబర్ 8న పెద్దనోట్లను ప్రధాని మోదీ రద్దు చేసిన తర్వాత ఈ విషయంలో ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. కొత్త రెండువేల నోటులో నానో జీపీఎస్ చిప్ ఉందని, ఎవరైనా పెద్దమొత్తంలో ఈ నోట్లను దాచిపెడితే.. సులువుగా దొరికిపోతారని, భూమిలో 120 మీటర్ల లోతులో నోట్లు దాచిపెట్టినా.. రాడర్ నిఘా నుంచి తప్పించుకోలేరంటూ ఈ వదంతి బాగా హల్ చల్ చేసింది. నోట్లరద్దుపై ప్రధాని మోదీ ప్రకటన చేసిన గంటలోపే తెరపైకి వచ్చిన ఈ రూమర్ ఎంత వేగంగా పాకిపోయిందంటే.. ఏకంగా దీనిపై ఆర్బీఐ సైతం వివరణ ఇచ్చింది. నోటులో అనేక భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి కానీ, ఎలాంటి చిప్ లేదని తేల్చేసింది.

కొత్త నోట్లలో రేడియోయాక్టివ్ ఇంక్
దేశంలో భారీగా కొత్త నోట్లు అక్రమార్కుల వద్ద దొరికిపోతుండటంతో తెరపైకి వచ్చిందీ ఈ వదంతి. ఆర్బీఐ రేడియోయాక్టివ్ ఇంక్ తో కొత్త రూ. 500, రెండువేల నోట్లను ముద్రించిందని, దీనితో ప్రజలకు ఎలాంటి హాని ఉండదని, కానీ ఎవరైనా వీటిని పెద్దమొత్తంలో దాచుకుంటే ఐటీ అధికారులు ఇట్టే పట్టేయగలరంటూ ఈ ఫేక్ న్యూస్ హల్ చల్ చేసింది. ఈ ఇంక్ వల్లే పెద్ద ఎత్తున అక్రమార్కులు దొరికిపోతున్నారంటూ ఊహాగానాలు జోడించింది.

వాట్సాప్ ప్రొఫెల్ పిక్చర్లతో..
మహిళలు తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లు తొలగించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ సూచించినట్టు వచ్చిన ఒక రూమర్ హల్ చల్ చేసింది. ఈ ప్రొఫైల్ చిత్రాలను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దుర్వినియోగం చేయవచ్చునని, ఈ చిత్రాల ద్వారా  ఇస్లామిక్ స్టేట్ హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం దొంగలించి.. దానిని ఉగ్రవాద కార్యక్రమాల్లో దుర్వినియోగం చేయవచ్చునంటూ, మహిళల అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వదంతి చక్కర్లు కొట్టింది. అయితే, ఢిల్లీ పోలీసు కమిషనర్ ఏకే మిట్టల్ ఈ ప్రకటన చేశారని ఈ వదంతి పేర్కొనగా.. అసలు ఢిల్లీ సీపీ ఏకే వర్మ కావడంతో ఇది ఫేక్ అని తేలిపోయింది.

పది రూపాయల నాణెలు రద్దుచేసిన ఆర్బీఐ
నోట్ల రద్దుకు ముందు ఆగ్రా, ఢిల్లీ, మీరట్ ప్రాంతాల్లో ఈ ఫేక్ వార్త బాగా హల్ చల్ చేసింది. పదిరూపాయల నాణెలను ఆర్బీఐ రద్దు చేసిందంటూ కథనాలు రావడంతో స్థానిక వ్యాపారులు, రిక్షా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి ఇది ఈ వార్త వట్టి బూటకమని తేల్చింది.

జయలలిత రహస్య కూతురు!

 తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి తర్వాత ఆమెకు రహస్యంగా కూతురు ఉన్నారని, ఆమె అమెరికాలో నివసిస్తున్నారని ఓ మహిళ ఫొటోతో బూటకపు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలు ఖండిస్తూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద వివరణ ఇచ్చింది. సదరు ఫొటోలో ఉన్న మహిళతో జయలలితకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఆస్ట్రేలియాలో నివసిస్తున్నదని చిన్మయి తెలిపింది.

ఉప్పు కొరత!
నోట్ల రద్దు తర్వాత ఉప్పు కొరత వదంతి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద దుమారమే రేపింది. దేశానికి 7,517 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నా ఉప్పు కొరత వస్తుందంటూ వార్తలు రాగా.. సామాన్యులు అది నమ్మి అర్ధరాత్రి దుకాణాలకు పోటెత్తారు. ఉప్పు ధర నాలుగు రెట్లు పెరిగిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ యూపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, హైదరాబాద్ లో ఈ రూమర్ల ప్రభావం పడింది. ఉప్పు కోసం జనాలు పోటెత్తడంతో కాన్పూర్ లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

నెహ్రూ ప్రభుత్వం మర్రిచెట్టులా నిలిచింది
దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్  నెహ్రూ ప్రభుత్వం మరిచెట్టులా నీడ పరిచిందని, ఆయన కుటుంబం వల్ల ఇతరులు ఎదిగే అవకాశమే లేకుండా పోయిందని విమర్శిస్తూ బీబీసీ ఇండియా మాజీ బ్యూరో చీఫ్ మార్క్ టుల్లీ అన్నట్టు వదంతులు వచ్చాయి. ప్రధాని మోదీని పొగుడుతూ.. ఆయన వ్యాఖ్యలు చేశారని ఈ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ తాను అలా అనలేదని మార్క్ టుల్లీ స్వయంగా వివరణ ఇచ్చారు.
 
                                                                                                                               సోర్స్ : సాక్షి దినపత్రిక





5:35:00 PM


Oneplus కంపెని December dash సేల్స్ కు రెడీ అవుతుంది.  ఇది పర్టికులర్ డేట్స్ లో డిసెంబర్ నెల అంతా ఉండనుంది. కంపెని కొత్తగా oneplus 3T ఫోన్ రిలీజ్ చేసింది.
ఈ ఫోన్ ను ఇప్పుడు క్రింద చెప్పబడిన డేట్స్ లో registered users కు oneplus స్టోర్ లో కేవలం ఒక్క రూపాయి కే కొనే అవకాశం ఇస్తుంది Oneplus. రిజిస్ట్రేషన్ లింక్ క్రింద ఉంది.
డిసెంబర్ 9, 16, 23 మరియు 30 న కంపెని స్టోర్ లో మధ్యాహ్నం 12 నుండి సాయింత్రం 6 వరకూ ఈ సేల్స్ మొదలవుతాయి. 3T ఫోన్ తో పాటు earphones, కాలేజ్ బ్యాగ్, cases, accessories కూడా 1 rupee కు గెలుచుకోగలరు.

సేల్స్ లో పాల్గొనాలంటే ఏమి చేయాలి

ముందుగా oneplus  స్టోర్ సైట్ లో పేరు, ఫోన్ నంబర్, అడ్రెస్  డిటేల్స్ నింపి అకౌంట్ క్రియేట్ చేయాలి ( store లింక్ ). ఈ డిటేల్స్ ఐటెం ను కొనేటప్పుడు ఎంటర్ చేయకుండా ముందే ఎంటర్ చేసి పెట్టుకోవటానికి. తరువాత ఆఫర్ వివరాలను లింక్ ద్వారా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షేర్ చేయాలి. ఇప్పుడు register అయ్యినట్లే మీరు.
మీ లింక్ ద్వారా ఎవరైనా కొత్త వాళ్ళు రిజిస్టర్ అయితే మీకు పాయింట్స్ ఇస్తుంది. ఒక 6 members చే రిజిస్టర్ చేయించినా మీరు 1 రూపాయి కి oneplus ఐటెం కొనవచ్చు అని అంటుంది కంపెని. కంపెని తెలిపిన సమాచారం ప్రకారం పాయింట్స్ పెరిగేకొద్దీ హై వాల్యూ ఐటెం కొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ లింక్ పై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోగలరు.
అంతే! ఇక మీరు సొంతం చేసుకున్న పాయింట్స్ కు అనుగుణంగా పైన చెప్పబడిన డేట్స్/టైమింగ్ లో Oneplus ఐటమ్స్(ear ఫోన్స్, 3T ఫోన్, టి షర్ట్స్, cases, బాగ్స్ etc) ను cart లో యాడ్ చేసుకోగలిగితే మీరు వాటిని 1rupee కే కొనే అవకాశం ఉంది.
అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? / ఎలా రిజిస్టర్ అవ్వాలి?
  • ముందుగా  మీరు ఈ లింక్ పై క్లిక్ చేసి oneplus ఆఫర్ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.
  • సైట్ ఓపెన్ అయిన తరువాత, కొంచెం క్రిందకు స్క్రోల్ చేస్తే Entry Challenge అని వైట్ కలర్ లో హెడ్డింగ్ ఉంటుంది. దాని క్రింద  Get your Oneplus Account ready అని ఉంటుంది. అక్కడే దాని ప్రక్కన రైట్ సైడ్ Sign In అని కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు  మీరు కొత్త పేజ్ లోకి వెళ్తారు. అక్కడ sign up with e-mail అని ఉంటుంది. దానిపై టాప్ చేయండి.
  • username, email, password ఎంటర్ చేసిన తరువాత క్రింద I'm not robot అని ఉన్న బాక్స్ పై టచ్ చేసి క్రింద ఉన్న రెడ్ కలర్ sign up బటన్ పై టాప్ చేయండి.
  • ఇప్పుడు మీ మెయిల్ కు confirmation మెయిల్ వస్తుంది. దానిని ఓపెన్ చేసి కచ్చితంగా confirm చేయాలి.
  • ఇప్పుడు మరలా Entry Challenge హెడ్డింగ్ క్రింద ఉన్న ఇతర మూడు (ఫోన్ నంబర్, ఫోన్ షిప్పింగ్ అడ్రెస్ మరియు సోషల్ నెట్వర్కింగ్ షేరింగ్ ) పనులు చేయాలి.
Source From digit


10:20:00 AM


గౌరవ్ తివారీ దెయ్యాల్ని పట్టుకుంటాడు. ఇది తెలిసి దెయ్యాలన్నీ కలిసి ఓ మీటింగ్ పెట్టుకున్నాయట. దెయ్యమంటే భయం ఉండాలి కానీ గౌరవ్‌కి గౌరవం పెరగడం ఏంటని మీటింగ్‌లో నిరసనలు. ‘వెంటనే ఖతమ్ చేసెయ్యాలి’ అంది దెయ్యాల ప్రెసిడెంట్.అలా ఎందుకని ఓ పిల్లదెయ్యం అడిగింది. లేకపోతే ప్రజలకి మనమీద భయం పోతుంది,చెప్పాడు ప్రెసిడెంట్. సారీ, చెప్పింది ప్రెసిడెంట్ దెయ్యం.అంతే... నెక్స్ట్ డే మార్నింగ్... సారీ, నైట్ గౌరవ్ గొంతు పిసికి చంపేశాయట. దెయ్యాలుంటాయని నమ్మేవారు రాసుకున్న కథలివి.. హేతువాదులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు..  దెయ్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనుకునేవాళ్లు  మాటిమాటికీ మంచం కిందికి తొంగి చూసుకుంటున్నారు... జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. దెయ్యాల్లేవ్, భూతాల్లేవ్... కానీ భయమైతే ఉంది.  భయాన్ని మించిన దెయ్యం లేదు! లేదూ దెయ్యమే చంపింది అంటే...

దెయ్యాల వేట సాగించే ఆ సాహసవంతుడు మరిలేడు. అనుమానాస్పదంగా మరణించాడు. ప్రమాదవశాత్తూ చనిపోయాడా... ఆత్మహత్య చేసుకున్నాడా... లేదా దెయ్యాలే చంపేశాయా? ఇదో మిస్టరీ. వారం రోజుల క్రితం మరణించిన ఘోస్ట్ హంటర్ గౌరవ్ తివారీ కథ ఇప్పుడు దేశ విదేశాల్లో పారా నార్మల్ యాక్టివిటీల్లో నిమగ్నమైన గ్రూపులలో ఉత్కంఠ రేపుతోంది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. గౌరవ్ తివారీ ఎవరో తెలుసుకునే ముందు అతడేం చేసేవాడో చూద్దాం.

కోల్‌కతాలోని ఓ అపార్ట్‌మెంటు...
ఐదో అంతస్తులోని ఒక ఫ్లాట్ తలుపు బర్రున తెరుచుకుంది. లోపలంతా చిక్కటి చీకటి. కన్ను పొడుచుకుని చూసినా ఏమీ కనిపించడం లేదు. ‘ఏంటిది... భూత్ బంగ్లాలా ఇలా ఉంది’ అంటూ లోపలికి అడుగు పెట్టాడా వ్యక్తి. చేతిలోని టార్చ్‌ను ఆన్ చేశాడు. ఆ వెలుగులోనే స్విచ్‌బోర్డ్ ఎక్కడుందో వెతుక్కుని లైట్ ఆన్ చేశాడు. ఒక్కసారి చుట్టూ పరికించి చూశాడు. ‘వావ్... చీకటిలో కనిపించలేదు కానీ ఫ్లాట్ అదిరింది’ అనుకుంటూ ఒక్కో గది తలుపూ తెరిచి చూడటం మొదలుపెట్టాడు. కిచెన్, డైనింగ్ హాల్, స్టడీ రూమ్... అన్నీ చాలా బాగున్నాయి. ఇక బెడ్‌రూమ్ ఎలా ఉందో చూడాలి అనుకుంటూ డోరు తీశాడు. లోనికి అడుగుపెడుతుంటే ఎవరిదో నవ్వు వినిపించింది. ఎవరిదో అర్థం కాలేదు. కిటికీ తీసి చూశాడు బయట ఎవరైనా ఉన్నారేమో అని. ఎవరూ లేరు. మరి నవ్వింది ఎవరు అనుకుంటూ ఉండగానే మళ్లీ నవ్వు వినిపించింది. అతని వెన్నులో వణుకు. ఒకవేళ అది తన భ్రమ అయివుంటుంది అనుకున్నాడు. కానీ అది భ్రమ కాదని ఆరోజు రాత్రి అర్థమయ్యిందతనికి. ఎవరో అమ్మాయి నవ్వులు... అంతలోనే ఏడుపులు... మధ్యలో మూలుగులు. ఉన్నట్టుండి కప్పుకున్న దుప్పటి గాల్లోకి లేచింది. సైడ్ టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసు కింద పడి భళ్లున బద్దలయ్యింది. ఏసీ లేకపోయినా గది మొత్తం చల్లగా అయిపోయింది. మళ్లీ అంతలోనే వేడెక్కిపో యింది. మొత్తానికి ఆ రాత్రి అతనికి కాళరాత్రి అయ్యింది.

అంతా శ్రద్ధగా విన్నాడు గౌరవ్ తివారీ. వెంటనే ఆ వ్యక్తిని తీసుకుని అతని ఫ్లాట్‌కి బయలుదేరాడు. ఆ గదిలో అడుగుపెడుతూనే అతనికి అర్థమైపోయింది అక్కడ ఏం జరుగుతోందో, ఎవరి వల్ల జరుగుతోందో. కొద్దిపాటి  అన్వేషణ సాగించాడు. ఆచూకీ తెలిసింది. ఎస్. అక్కడ ఒక ఆత్మ ఉంది. కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంది. భర్త చేతిలో వంచనకు గురై, హింసకు గురై, చివరికి ప్రాణాలే కోల్పోయిన వేదనతో దెయ్యమై అక్కడే తిరుగాడుతోంది.

ఇక్కడ గౌరవ్ రెండు విషయాలు చెబుతాడు. ఒకటి: అక్కడ దెయ్యం ఉంది కనుక ఆ స్థలం విడిచి పెట్టమని. లేదా ఆ దెయ్యాన్ని తాను పారదోలదలుచుకుంటే అందుకు సహకరించమని. గౌరవ్ ఎక్కువగా దెయ్యాలు ఆ ప్రదేశంలో కచ్చితంగా ఉన్నాయి అని నిరూపించడమే తన పనిగా పెట్టుకున్నాడు.

ఎలా చనిపోయాడు...
జూలై 7, 2016. ఢిల్లీలోని ద్వారక. ఉదయం పది గంటలు కావస్తోంది. గౌరవ్ తివారీ గది తలుపు మూసి ఉంది. కాఫీ తీసుకొచ్చిన భార్య సున్నితంగా తలుపు తోసింది. తెరచుకోలేదు. చిన్నగా తట్టింది. లోపలి నుంచి అలికిడి లేదు. దబదబా బాదింది. అయినా తెరవలేదు. తలుపు తెరవమంటూ అరిచింది. అతను పలకలేదు. దాంతో కంగారుపడి అత్తమావల్ని పిలిచింది. వాళ్లు కూడా ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. దాంతో బల వంతంగా తలుపు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే అటాచ్డ్ బాత్రూమ్‌లో నేలమీద పడివున్నాడు గౌరవ్. ఉలుకూ పలుకూ లేదు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఉపయోగం లేకపోయింది. అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ క్షణం అతని జీవితం అంతమైపోయింది. కానీ ఓ కొత్త మిస్టరీకి తెర లేచింది.

గౌరవ్ మెడ చుట్టూ తాడుతో బిగించినట్టుగా నల్లని గీత ఒకటుంది. అంటే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అన్నారు పోలీసులు. ఊపిరాడకే చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా తేల్చడంతో అతనిది సూసైడ్ అని డిసైడైపోయారంతా. గౌరవ్ భార్య నోరు తెరవకపోయి ఉంటే అందరూ అదే నిజం అనుకునేవారు. కానీ ఆమె చెప్పింది విన్న తర్వాత కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పింది?

వెంటాడుతున్న ఆత్మ...
‘నా భర్త గౌరవ్‌ని ఓ ఆత్మ వెంటాడుతోంది’ అని చెప్పిందామె. ‘ఆ సంగతి నాతో తరచూ చెప్పేవాడు. అది తనను ఎప్పుడో ఒకప్పుడు తన అధీనంలోకి తీసేసుకుంటుందని గౌరవ్ భయపడ్డాడు. కొన్నాళ్లుగా ఆ విషయాన్ని  తరచూ చెబుతున్నాడు కానీ పని ఒత్తిడిలో ఏదో అలా మాట్లాడుతున్నాడు అనుకుని పట్టించుకోలేదు’ అందామె. గౌరవ్ తండ్రి కూడా అది నిజమే కావచ్చు అంటున్నారు. గౌరవ్ అభిమానులు కూడా అలాగే జరిగిందేమో అని అనుమానపడుతున్నారు. అందరూ చెప్తున్నదాన్ని బట్టి ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు, బాధలు గౌరవ్‌కి లేవు. పైగా అయిదు నెలల క్రితమే పెళ్లయ్యింది. మరి ఎందుకు ప్రాణం తీసుకుంటాడు? ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా తాడుకి వేళ్లాడుతూ ఉండాలి. కానీ అతడు నేలమీద పడివున్నాడు. కనీసం అతడు ఉరి వేసుకున్న తాడు కూడా అక్కడ లేదు. అంటే గౌరవ్‌ని దెయ్యం చంపిందా? అది సాధ్యమేనా?

దేవుడు, దెయ్యాలు లేవనే నాస్తికులు ఈ సంగతి విని నవ్వి ఊరుకున్నారు. కానీ దెయాల్ని నమ్మేవారు, వాటి ఉనికిని రుచి చూసినవాళ్లు మాత్రం భయంతో వణుకుతున్నారు. దెయ్యాల్ని వేటాడేవాడు ఆ దెయ్యాలకే బలైపోయాడా అంటూ వాపోతున్నారు. నిజమా? గౌరవ్‌ని దెయ్యాలే చంపేశాయా? ప్రస్తుతం అతను ఢిల్లీలోని జానకీపుర ప్రాంతంలో సంచరిస్తోన్న ఓ మహిళ ఆత్మ గురించి పరిశోధిస్తున్నాడని తెలిసింది. దానికీ అతని చావుకీ ఏదైనా సంబంధం ఉందా? గౌరవ్‌ని వెంటాడుతోంది ఆ ఆత్మేనా? ఆ ఆడదెయ్యమే అతణ్ని వేటా డిందా? అంటే పోలీసులు దెయ్యాన్ని అరెస్ట్ చేయాలా?


దెయ్యాల్ని వేటాడేదెలా?
అతీంద్రియ శక్తుల ఉనికిని పారానార్మల్ యాక్టివిటీ అంటారు. వాటిని కనిపెట్టేవాళ్లని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్, ఘోస్ట్ బస్టర్స్, ఘోస్ట్ హంటర్స్ అంటారు. ఘోస్ట్ హంటింగ్ అన్న మాట మన దేశంలో తక్కువే వినిపిస్తుంది కానీ, విదేశాల్లో... ముఖ్యంగా అమెరికాలో ఇది చాలా ఎక్కువ. దెయ్యాలు ఉన్నాయి అని అనుమానం వచ్చిన ప్రదేశాల్లో పరిశోధనలు జరపడం, దెయ్యాల ఉనికిని కనిపెట్టడమే ఘోస్ట్ హంటింగ్. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ డిటెక్టర్ (దీన్ని ఈఎంఫ్ మీటర్ అని కూడా అంటారు), డిజిటల్ థర్మోమీటర్, డిజిటల్ వీడియో కెమెరాలు, డిజిటల్ ఆడియో రికార్డర్, కంప్యూటర్ తదితర పరికరాలను ఉపయోగించి శబ్దాలను, దృశ్యాలను రికార్డు చేస్తారు. తద్వారా అక్కడ దెయ్యం ఉందో లేదో కనిపెడతారు. కొందరు వాటిని వెళ్లగొడతారు కూడా. అమెరికాకు చెందిన ఎడ్, లారెన్ దంపతులను ప్రపంచంలోనే నంబర్‌వన్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అని చెబుతారు. వీరి పరిశోధనల ఆధారంగానే ఆనబెల్లె, కన్జ్యూరింగ్, పారానార్మల్ యాక్టివిటీ, పోల్టర్‌గైస్ట్ లాంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. మన దేశపు తొలి ప్రఖ్యాత ఘోస్ట్ హంటర్ కావడం వల్ల గౌరవ్ తివారీని ఎడ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు.

పదహారేళ్ల వయసులో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు గౌరవ్ తివారీ. టాంగో చార్లీ, 16 డిసెంబర్ చిత్రాల్లో నటించాడు. తర్వాత పైలట్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్లిపోయాడు. గౌరవ్ కేవలం ఘోస్ట్ హంటరే కాదు... రెవరెండ్, స్పిరిచ్యువల్ కౌన్సెలర్, హిప్నటిస్ట్, లైఫ్ అండ్ రిలేషన్‌షిప్ కోచ్ కూడా. అయితే ఘోస్ట్ హంటర్‌గానే ఎక్కువ పాపులర్ అయ్యాడు. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో గౌరవ్ ఘోస్ట్ హంటింగ్స్ చేశాడు.
   
గౌరవ్ హంటింగ్స్ ఆధారంగా పలు టీవీ షోలు రూపొందాయి. వాటిలో ‘ఎమ్‌టీవీ గాళ్స్ నైటవుట్’ ఒకటి. ఇది మన దేశంలో తొలి హారర్ రియాలిటీ షో. ఇది ఏషియన్ టెలివిజన్ అవార్డును గెల్చుకుంది. అలాగే హాంటెడ్ వీకెండ్స్ విత్ సన్నీ లియోన్, ఫియర్ ఫైల్స్, భూత్ ఆయా షోలు కూడా సక్సెస్ అయ్యాయి. వీటిలో కొన్నింటిలో గౌరవ్ కూడా కనిపించాడు.

దెయ్యమై వచ్చింది!
ఇరవై రోజుల శెలవు తర్వాత ఆఫీసులో అడుగు పెట్టింది సీమ (పేరు మార్చాం). ఆమెను అందరూ సంతోషంగా పలకరించారు. పరామర్శల తర్వాత పనిలో పడిపోయింది సీమ. సాయంత్రం ఇంటికి బయలుదేరేటప్పుడు ‘చాలా రోజులయ్యింది కదా... ఈరోజు నాతో నా రూమ్‌కి రావే’ అంది సీమ ఫ్రెండ్ కాజల్. ‘దానికేం... పద పోదాం’ అది సీమ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాజల్ రూమ్‌కి వెళ్లారు. సరదాగా గడిపారు. రాత్రి పది అవుతుండగా సీమ వెళ్లిపోయింది. కాజల్ పడక మీదకు చేరింది. మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు బయల్దేరి ఆటో కోసం ఎదురుచూస్తోన్న కాజల్‌కు సీమ వాళ్ల అక్క కనిపించింది. సంతోషంగా వెళ్లి పలకరించింది. ముందు రోజు తాను, సీమ కలిసి గడిపినట్టు చెప్పింది. అది విని సీమ అక్క షాకైపోయింది. ‘సీమ యాక్సిడెంట్‌లో చనిపోయి పదిహేను రోజులవుతోంది. తను నీ దగ్గరకు రావడమేంటి’ అంది. అంతే... కాజల్ పై ప్రాణాలు పైనే పోయాయి.

ఇది ఢిల్లీలో జరిగిన ఓ వాస్తవ ఘటన. గౌరవ్ డీల్ చేసిన కేసుల్లో ఇదొకటి. మరణించిన సీమ మళ్లీ ఎలా వచ్చిందో అర్థం కాక ఈ విషయాన్ని గౌరవ్ దృష్టికి తీసుకెళ్లారు. సీమ ఆత్మే అలా వచ్చిందని తేల్చాడు గౌరవ్. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత మళ్లీ ఆ ఆత్మ కనిపించలేదు.

ఇంటి గొడవలే కారణమా?
గౌరవ్ మృతి వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. మొదట గౌరవ్ మృతదేహం బాత్రూమ్‌లో నేలమీద పడివుంది అన్నారు. తర్వాతేమో బట్టలు హ్యాంగ్ చేసుకునే రాడ్‌కి ఓ క్లాత్‌తో ఉరి వేసుకున్నాడు అన్నారు. వీటిలో ఏది నిజం, ఏది కాదు అన్నది ఓ పెద్ద సందేహం. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణం ఏముంటుంది అన్నది మరో పెద్ద సందేహం. పోలీసులు మాత్రం ఇంటి గొడవలే కారణమై ఉండొచ్చు అంటున్నారు. గౌరవ్ ప్రొఫెషన్ కారణంగా అతని ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. దెయ్యాలు, భూతాలు అంటూ తిరగడం, అర్ధరాత్రిళ్లు ఇంటికి రావడం, సంపాదన సరిగ్గా లేకపోవడం వంటి విషయాలపై అటు భార్య, ఇటు తండ్రి కూడా అతనిని తప్పు పట్టి నిందిస్తున్నట్లు పనివాళ్లు, కొందరు దగ్గరివాళ్ల ద్వారా తెలిసిందని పోలీసులు అంటున్నారు. మరి నిజం ఎప్పటికి నిర్ధారణ అవుతుందో!

                                                                                                                               Source : సాక్షి దినపత్రిక

8:06:00 AM
 

కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజాస్వామ్యాన్ని కాలరాచి, హక్కుల పీకనొక్కి నిరంకుశంగా వ్యవహరించింది. శాంతియుతంగా దీక్ష చేపట్టిన ముద్రగడ అసలు ఎక్కడున్నారో, పోలీసులు ఏం చేస్తున్నారనే విషయం కొన్ని గంటలపాటు ప్రజలకు తెలియకుండా చేసింది.

ముద్రగడ ఆమరణ దీక్ష, అనంతర పరిణామాలు ప్రజలకు తెలియకుండా సాక్షి టీవీలో ప్రసారాలను నిలిపివేయించింది. సెల్‌ఫోన్ల నుంచి సందేశాలు వెళ్లకుండా అడ్డుకుంది. దీక్ష కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించింది. గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ఒకరకంగా యుద్ధ వాతావారణాన్ని సృష్టించింది. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయించింది. సర్కారు నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ముద్రగడ పురుగుల మందు తాగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన రాజమహేంద్రవరం ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు.

కుటుంబ సమేతంగా దీక్ష
కాపులకు రిజర్వేషన్, తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన పరిణామాలపై నమోదైన కేసుల ఉపసంహ రణ డిమాండ్లతో ముద్రగడ గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన స్వగృహంలో కుటుంబ సమేతంగా ఆమరణ దీక్ష ప్రారంభించారు. అప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పోలీసు బలగాలు ముద్రగడ ఇంటి చుట్టూ మోహరించాయి.

దీక్షలో ఉన్న ముద్రగడతో చర్చలు జరిపేందుకు పోలీసులు ప్రయత్నించగా, కాపు నాయకులు అడ్డుకున్నారు. తుని ఘటనలో అరెస్టయిన వారిలో వెఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారని చెబుతున్నారని, అమలాపురంలో అరెస్టయిన వారిలో టీడీపీ క్రియాశీలక కార్యకర్త దూడల మణి ఉన్నారంటూ అందుకు సంబంధించిన టీడీపీ సభ్యత్వ కరపత్రాన్ని ప్రదర్శించారు. ఈలోగా పోలీసు అధికారులు ముద్రగడ దీక్ష చేస్తున్న గదిలోకి వె ళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు. ‘మీరు ఏదైనా మాట్లాడదలచుకుంటే ముద్రగడ కిటికీ వద్దకు వస్తారు. అక్కడే మాట్లాడండి’ అని కాపు నేతలు తేల్చిచెప్పారు.

ఆత్మహత్య చేసుకుంటా..
ఇదే సమయంలో పోలీసులు, యాంటీ నక్సల్స్ స్క్వాడ్ ఒకేసారి ముద్రగడ ఇంటి వరండాలోకి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. గదిలో తాను కూర్చున్న సోఫాలోంచి లేచి పురుగుల మందు డబ్బా పట్టుకొని కిటికీ వద్దకు వచ్చారు. ‘అడిషనల్ ఎస్పీగారూ! ఏమనుకుంటున్నారు? ఈ చుట్టుపక్కల పోలీసులు ఎవరైనా కనిపిస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటా’ అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ‘మీకు సంబంధం లేదన్నారు కదా.. వెళ్లిపోండి. సీబీసీఐడీని రప్పించండి’ అని చెప్పి తిరిగి వెళ్లి సోఫాలో కూర్చున్నారు.

69 కేసుల ఎఫ్‌ఐఆర్ కాపీలు చూపాలి
అనంతరం రాజమహేంద్రవరం నుంచి సీఐడీ డీఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఓ బృందం ముద్రగడ ఇంటికి చేరుకుంది. ముద్రగడను ఏ కారణంతో అరెస్టు చేయడానికి వచ్చారో చెప్పాలని కాపు నాయకులు పోలీసులను నిలదీశారు. ముద్రగడపై 69 కేసులు ఉన్నాయని హోంమంత్రి చినరాజప్ప చెబుతున్నారని, వాటి ఎఫ్‌ఐఆర్ కాపీలను తమకు అందజేస్తే అప్పుడు ముద్రగడ అరెస్టవుతార ని తెలిపారు.

తుని ఘటనలో నమోదైన కేసుల్లో రెండింటిలో దర్యాప్తు పూర్తయిందని, దానిపైనే అరెస్ట్ చేస్తామని సీఐడీ డీఎస్పీ హరికృష్ణ చెప్పారు. ఆ ఎఫ్‌ఐఆర్ కాపీలు ఇస్తే అరెస్ట్‌కు ముద్రగడ సిద్ధమని కాపు నేతలు స్పష్టం చేశారు. సాంకేతికంగా కాపీలు ఇవ్వలేమని, లొంగిపోతే విచారణ సందర్భంగా అన్ని వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ చెప్పడంతో కాపు నాయకులు నిరాకరించారు. చర్చలు లేవని, వెళ్లిపోవాలని పోలీసులకు చెప్పారు. మరోవైపు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.

పోలీసులను ప్రతిఘటించిన నేతలు, అనుచరులు
దీక్ష చేస్తున్న ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఓ వైద్యబృందం గదిలోకి వెళ్లేం దుకు విఫలయత్నం చేసి, వెనుదిరిగింది. సాయంత్రం 4.20కి వందలాదిగా పోలీసులు మూకుమ్మడిగా ముద్రగడ దీక్ష  చేస్తున్న గదిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కాపు నాయకులు, ముద్రగడ అనుచరులు పోలీసులను ప్రతిఘటించారు. దీంతో పోలీ సులు లాఠీలకు పనిచెప్పారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు.

దాదాపు 60 మందిని అరెస్ట్ చేసి కాకినాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో  ముద్రగడ దీక్ష చేస్తున్న గది నుంచి మరో గదిలోకి వెళ్లి అప్పటికే తన వద్ద ఉంచుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు తలుపులను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశిం చారు. ముద్రగడను బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకొస్తుండగా ఆయన రెండో కుమారుడు గిరి అడ్డుకున్నారు. పోలీసులు ముద్రగడను బలవంతంగా అరెస్టు చేసి, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ముద్రగడ భార్య పద్మావతి, కోడలు సిరి, కుమారుడు గిరిలను మరో వాహనంలో ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముద్రగడ రాజమండ్రి ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన రక్త నమునాలను వైద్యుల బృందం సేకరించి పరీక్షలు నిర్వహించింది. మెటాబాలిక్ డెఫిషియన్సీ 160 ఉన్నట్టు, ఆయన పురుగుల మందు తాగి నట్టు ఈ పరీక్షలో నిర్ధారణైంది.  ముద్రగడ రక్తంలో చక్కెర స్థారుు 240 ఉందని, బీపీ 160/100 ఉందని.. వెంటనే ఆయనకు చికిత్స చేయకపోతే ఆరోగ్యం విషమించ వచ్చని వైద్యులు తెలపగా.. అందుకు ముద్రగడ ససేమిరా అంటున్నారు.

                                                                                                                               Source :సాక్షి దినపత్రిక 

7:59:00 PM


బెంగాల్ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా దేశవాళీ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఆరు నెలలు కూడా కాకముందే కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్ లో శుక్లా కు బెర్తు దొరికింది. 35 ఏళ్ల శుక్లా ఇక మీదట పశ్చిమబెంగాల్ మంత్రి.

పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమత వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మమతతో పాటు 42 మంది మంత్రులు ప్రమాణం చేశారు. 18 ఏళ్ల దేశవాళీ క్రికెట్ కెరీర్ కు గత డిసెంబర్ లో గుడ్ బై చెప్పిన శుక్లా ఎన్నికలకు ముందు తృణమాల్ కాంగ్రెస్ లో చేరారు. టీఎంసీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన శుక్లా తొలిప్రయత్నంలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉత్తర హౌరా నియోజకవర్గం నుంచి పోటీచేసిన శుక్లా  దాదాపు 27 వేల ఓట్ల మెజార్టీతో లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి పాఠక్ ను ఓడించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో క్రీడా ప్రముఖులు టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ (కేరళ), భారత ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా (పశ్చిమబెంగాల్) ఓటమి చవిచూడగా, శుక్లా మాత్రం తొలిసారి ఎమ్మెల్యేగా  ఎన్నిక కావడంతో పాటు ఏకంగా మంత్రి అయ్యారు. శుక్లా టీమిండియా తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు ఆడారు.

7:07:00 PM


బీజింగ్ : బాహుబలి సినిమా చూశారు కదూ.. అందులో శివుడి పాత్రధారి ప్రభాస్ నీళ్ల కొండ ఎక్కడానికి చాలా కష్టపడతాడు. ఎట్టకేలకు కొండ ఎక్కి.. హీరోయిన్‌ను కలుస్తాడు. చైనాలో కూడా అలాంటిదే ఓ పెద్ద కొండ ఉంది. కానీ ఆ కొండను ఎక్కేది మాత్రం చైనా బాహుబలి కాదు.. స్కూలు పిల్లలు! అవును, ప్రపంచానికి దూరంగా మారుమూల కొండ ప్రాంతంలో ఉండే ఓ కుగ్రామానికి చెందిన పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే 2,624 అడుగుల ఎత్తున్న కొండను ఎక్కాలి. మళ్లీ ఇళ్లకు రావాలంటే దిగాలి. కొండ ఎక్కేందుకు వారికి రెండు గంటల సమయం పడుతుంది. అలా ఎక్కడం కూడా చాలా కష్టమైన, ప్రమాదకరమైన పని.

                                                                                                                                     SakshiNewspapers

9:54:00 AM

- దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్
- ఖాళీ విమానం 300 టన్నుల ఇంధనాన్ని నింపుకొని ఆగకుండా18,000 కి.మీ. ప్రయాణించగలదు
- గరిష్టంగా 640టన్నుల బరువును మోసుకుంటూ గాలిలోకి ఎగరగలదు.
- విమానం పొడవు 84 మీటర్లు, రెక్కలతో కలిపి వెడల్పు 88.4 మీటర్లు. దాదాపు రెండు ఫుట్‌బాల్ మైదానాల స్థలాన్ని ఈ విమానం ఆక్రమిస్తుంది.

శంషాబాద్: ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ఆంటోనోవ్ ఏఎన్-225 మైరియా’ కార్గో విమానం భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో అడుగిడింది. గురువారం అర్ధరాత్రి 12.05 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దీనిని ల్యాండ్ చేశారు. 240 ప్రపంచ రికార్డులు కలిగిన ఏన్-225 రాకతో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

చెక్ రిపబ్లిక్ ప్రాగ్‌లో తయారైన 117 టన్నుల బరువైన పవర్ జనరేటర్‌ను తుర్క్‌మెనిస్థాన్‌లోని తుర్కమెంబాషి విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఈ విమానం తీసుకెళుతోంది. 24 గంటల విశ్రాంతి అనంతరం శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత బయలుదేరనుంది. ఇండోనేషియాలోని జకార్తాలో మరోసారి విశ్రాంతి తీసుకుని.. ఆదివారం పెర్త్‌కు చేరుకోనుంది.
  • ప్రపంచంలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న అతిపెద్ద రవాణా విమానం ఇదే.
  • ఆరు టర్బో ఇంజన్‌లతో పనిచేస్తుంది. ఆరుగురు సిబ్బంది నియంత్రిస్తారు.
  • గరిష్టంగా 640 టన్నుల బరువును మోసుకుంటూ గాలిలోకి ఎగరగలదు.
  • విమానం పొడవు 84 మీటర్లు, రెక్కలతో కలిపి వెడల్పు 88.4 మీటర్లు. దాదాపు రెండు ఫుట్‌బాల్ మైదానాల స్థలాన్ని ఈ విమానం ఆక్రమిస్తుంది.
  • దీని ఎత్తు 18.1 మీటర్లు. అంటే ఆరు అంతస్తుల భవనంతో సమానం.
  • ఆకాశంలో 11 కిలోమీటర్ల ఎత్తులో గరిష్టంగా గంటకు 850 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లగలదు.
  • ఖాళీ విమానం 300 టన్నుల ఇంధనాన్ని నింపుకొని ఎక్కడా ఆగకుండా 18,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు
  • రవాణా చేసే కార్గో బరువును బట్టి ఇంధనాన్ని తగ్గిస్తారు.
  • సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు.. దానిలో భాగమైన ఉక్రెయిన్‌లో 1980 దశకంలో ఈ భారీ విమానం తయారీని ప్రారంభించారు.
  • అసలు దీనిని తయారు చేసింది మాత్రం సరుకు రవాణా కోసం కాదు.. సోవియట్ స్పేస్ షటిల్ ‘ది బ్యూరాన్’ను తరలించడం కోసం.
  • 1988 డిసెంబర్ 21న ఇది తొలిసారిగా ప్రయాణించింది. కొన్ని కారణాలతో 1994లో పక్కనపెట్టారు.
  • 2001లో దీనికి కొత్త ఇంజన్లు అమర్చి, పునరుద్ధరించాక తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది.
  • ఆస్ట్రేలియాలో వర్స్‌లీ అల్యూమినా అనే అల్యూమినియం మైనింగ్ సంస్థకు 117 టన్నుల భారీ పవర్ జనరేటర్‌ను రవాణా చేయడానికి అంతర్జాతీయ లాజిస్టిక్స్ (రవాణా) కంపెనీ ‘డీబీ చెంకర్’ ఈ విమానాన్ని ఆంటోనోవ్ సంస్థ నుంచి అద్దెకు తీసుకుంది.
  • ఈ విమానం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో దిగే సమయాన్ని సంబరంగా జరుపుకొనేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
  • దాదాపు 50 వేల మంది ఈ విమానాన్ని చూడడానికి రానున్నారు. ఇందుకోసం రన్‌వే సమీపంలో ప్రత్యేకంగా వేదికలూ నిర్మిస్తున్నారు.               

9:00:00 AM



ఐపీఎల్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య అప్పుడప్పుడూ గొడవలు మామూలే. ఐతే ఆదివారం ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. పుణెతో మ్యాచ్‌ సందర్భంగా ముంబయి ఆటగాళ్లు హర్భజన్‌, రాయుడు ఆవేశకావేశాలకు లోనయ్యారు. హర్భజన్‌ వేసిన 11వ ఓవర్లో సౌరభ్‌ మిడ్‌వికెట్‌ దిశగా కొట్టిన బంతిని రాయుడు బౌండరీ దగ్గర ఆపడానికి విఫలయత్నం చేశాడు. అతను డైవ్‌ చేసినా ఫలితం లేకపోయింది. ఐతే బంతి బౌండరీకి వెళ్లడంతో హర్భజన్‌.. రాయుడి వైపు ఆగ్రహంగా చూస్తూ తిట్టాడు. దీంతో రాయుడికి ఒళ్లుమండింది. ఎందుకలా తిడుతున్నావ్‌ అంటూ కోపంగా అతడివైపు దూసుకొచ్చాడు. దీంతో భజ్జీ కొంచెం ఆవేశం తగ్గించుకుని అతడి దగ్గరికెళ్లి సముదాయించే ప్రయత్నం చేశాడు. కానీ రాయుడు శాంతించలేదు. హర్భజన్‌ చేతిని విదిలించుకుంటూ కోపంగా వెళ్లిపోయాడు.

8:23:00 AM

అందరికీ తెలుసు గేల్ చాంపియన్, లారా కూడా చాంపియన్... ఒబామా చాంపియన్, మండేలా చాంపియన్’... ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో సింగిల్ ‘చాంపియన్’ సాహిత్యమిది! సాధారణ పదాలతో, వినేవారికి పెద్దగా శ్రమ కల్పించకుండా ఉంటూ అప్పటికప్పుడు అల్లుకున్న పాటలాగా ఇది అనిపిస్తుంది. క్రికెటర్‌గా బ్రేవోకున్న గుర్తింపు వల్ల పాట అందరికీ పరిచయమైతే... వెస్టిండీస్ వరల్డ్ కప్ విజయం ఇప్పుడు దానిని సూపర్‌హిట్  చేసింది. ‘చాంపియన్’ వీడియోకు యూ ట్యూబ్‌లో వారం వ్యవధిలోనే 4.5 మిలియన్ల హిట్స్ రావడం విశేషం.

విండీస్ ఆటగాళ్లయితే దానిని తమ టీమ్ థీమ్ సాంగ్‌గా మార్చుకోగా... ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పాట డ్యాన్స్ కదలికలను చాలా మంది క్రికెటర్లు, బాలీవుడ్ నటులు అనుకరించారు. రింగ్ టోన్‌లు, కాలర్ ట్యూన్‌లుగా పెట్టుకోవడంతో పాటు లెక్క లేనంత మంది అద్దం ముందు ఈ డ్యాన్స్‌ను చేసి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేస్తున్నారు.


 మొదటి సారేం కాదు
 క్రికెట్‌తో పాటు వినోద ప్రపంచంలో కూడా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న బ్రేవో ఆ క్రమంలో రూపొందించిన మూడో సింగిల్ చాంపియన్. ‘గో గ్యాల్ గో’ పేరుతో తొలి పాట అనంతరం 2013 ఐపీఎల్ సమయంలో చలో చలో అంటూ ఒక హింగ్లీష్ సాంగ్‌ను తయారు చేశాడు. ‘ఉలా’ అనే తమిళ చిత్రంలోనూ అతను ఒక పాట పాడాడు. చాంపియన్ పూర్తి వీడియో సాంగ్‌ను టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఇటీవల విడుదల చేయడానికి మూడు నెలల ముందే అతను మెల్‌బోర్న్‌లో బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా దీనిని వేదికపై ప్రదర్శించాడు. నాడు ప్రవాస భారత గాయని పల్లవి శారద అతనితో పదం కలిపింది. దీనిని ప్రమోట్ చేసేందుకు బ్రేవో లాస్ ఏంజెల్స్‌కు చెందిన వీనస్ మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత్‌లో ‘వేగ’ ఈ వీడియోను విడుదల చేసింది. జోసెఫ్ ఫెర్నాండో దీనికి దర్శకత్వం వహించాడు.


 చాలెంజ్ కూడా...
 మన ‘స్టాలిన్’ సినిమాలాగా, సరిగ్గా చెప్పాలంటే ‘స్వచ్ఛ భారత్’ ప్రచారం లాగా ‘చాంపియన్’ పాటకు కూడా ఇలా చేయగలరా అంటూ చాలెంజ్ విసిరాడు. అందరికంటే ముందుగా స్పందిం చిన గేల్ అలాగే డ్యాన్స్ చేసి మరో మూడు పేర్లు అమితాబ్, డివిలియర్స్, కోహ్లిను డ్యాన్స్ చేయాలంటూ నామినేట్ చేశాడు. హర్భజన్ సింగ్ కూడా ఈ పాటకు నర్తించి తన భార్య గీతా బస్రాతో పాటు సచిన్‌కు కూడా సవాల్ విసిరాడు. ‘కరీబియన్ సంస్కృతిలోనే సంగీతం ఉంది. ప్రపంచంలోని చాలా మంది పేరున్న సంగీతకర్తలు ఇక్కడి నుంచి వచ్చారు. క్రికెట్‌తోనే కాకుండా నా అభిమానులను వినోదంతో కూడా ఆనందపరచాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. చాంపియన్ ఇంత పెద్ద హిట్ అయి నా నమ్మకాన్ని నిలబెట్టింది’ అని బ్రేవో గర్వంగా చెప్పుకున్నాడు. మొత్తంగా ఆటతో పాటు విండీస్ పాట కూడా ఇప్పుడు సరికొత్త సంచలనంగా మారింది.

 ప్రముఖుల పేర్లతో...
చాంపియన్’ పాటలో డ్యాన్స్ మొత్తం దాదాపు ఒకే తరహాలో సాగుతుంది. అది సునాయాసంగా కూడా ఉండటంతో చాలా మందికి ఎక్కేసింది. ఈ పాటలో బ్రేవో తనతో పాటు గేల్, పొలార్డ్, లారా, రిచర్డ్స్, మార్షల్‌లాంటి వెస్టిండీస్ ఆటగాళ్ల పేర్లు తీసుకున్నాడు. ఇతర క్రీడా రంగాలకు చెందిన సెరెనా, ఉసేన్ బోల్ట్, జోర్డాన్‌లను చాంపియన్లుగా ప్రస్తుతిస్తూ ఒబామా, మండేలాలాంటి ప్రపంచ ప్రముఖుల పేర్లు కూడా చేర్చాడు. ట్రినిడాడ్ వాళ్ళంతా చాంపియన్లే అని కూడా అతను లైన్‌ను చేర్చాడు. డ్వేవో ఎక్కడా బహిరంగంగా చెప్పకపోయినా... పరిశీలిస్తే ఈ పాటలో పేర్లన్నీ నల్ల జాతివారివే కనిపిస్తాయి. వారి గొప్పతనం చెప్పడం కూడా అతని ఉద్దేశం కావచ్చు.
                                                                                                                                source:సాక్షి దినపత్రిక

8:18:00 AM

స్నాప్ డీల్ లో ఏదైనా మొబైల్ ఫోన్ కొంటే, నాలుగు గంటల్లో మన చేతిలోకి వచ్చేస్తుంది. దీంతో మొబైల్ కొనుగోలులో స్నాప్ డీల్ కు ఫుల్ క్రేజ్ పెరిగింది. ఈ విధంగా అన్ని వస్తువులను నాలుగు గంటల్లోనే వినియోగదారుల ముందుంచాలని స్నాప్ డీల్ నిర్ణయించింది. డెలివరీ టైమ్ ను గతేడాది కంటే 70శాతం పెంచుకున్నామని, ఫోన్లకే పరిమితమైన ఈ నాలుగు గంటల డెలివరీని మరిన్ని వస్తువులకు అందజేయనున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ చిత్రవంశీ తెలిపారు.

దాదాపు వినియోగదారులు కొనుకునే 99 శాతం ఉత్పత్తులను అదే రోజు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఉత్పత్తులను నాలుగు గంటలోనే అందించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. భారత ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న గూర్గావ్ కు చెందిన ఈ సంస్థ, దాదాపు రూ.1,300 కోట్లు పెట్టుబడులతో  2 మిలియన్ల చదరపు అడుగుల గిడ్డంగి సామర్థ్యంతో 2015లో మార్కెట్లోకి ప్రవేశించింది. 2015లో 7 శాతం ఉత్పత్తులను మాత్రమే తన గిడ్డంగి నుంచి అందజేసిన ఈ సంస్థ, ప్రస్తుతం 70శాతం ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేస్తోంది. క్రమేపి తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఉత్పత్తులను త్వరగా వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చిత్రవంశీ చెప్పారు.
                                                                                                                                 source:సాక్షి దినపత్రిక 

MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget