Halloween Costume ideas 2015
Latest Post

8:45:00 AM

సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు శ్రీనువైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జూన్ 10 నుంచి మొదలుపెడుతున్నారు. యూనిట్ అంతా ఇప్పుడు అందుకు సంబంధించిన సన్నాహాలను ఆరంభించే పనుల్లో వున్నారు. 'పండగ చేస్కో' తరువాత గోపీచంద్ మలినేని చేస్తోన్న సినిమా ఇది. ఇక సాయిధరమ్ తేజ్ నటించిన 'సుప్రీమ్' మే 5న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఆయన మరో సినిమా 'తిక్క' సెట్స్ పై వుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్ తో కలిసి నటించిన రకుల్, ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ తో జోడీ కట్టడం విశేషం

8:41:00 AM

ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల చిన్న కుమార్తె శ్రీదేవికి శుక్రవారం ఘనంగా సీమంతం వేడుక జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత రాహుల్‌ని పెళ్లి చేసుకున్న శ్రీదేవి ప్రస్తుతం గర్భవతి. ఈ సందర్భంగా ఆమె తండ్రి విజయ్ కుమార్... శ్రీదేవికి సీమంతం వేడుకను వైభవంగా చేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీస్టార్స్ హాజరయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి విశాల్, స్నేహ, మీనా, ధనుష్ భార్య ఐశ్వర్యతో తమిళ చిత్రసీమ నుంచి పలువురు ఆడవాళ్లు ఈ కార్యక్రమానికి వచ్చి శ్రీదేవిని ఆశీర్వదించారు.
 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పరిచయమైన ‘ఈశ్వర్’ సినిమా ద్వారానే శ్రీదేవి కూడా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తరుణ్‌తో ‘నిన్నే ఇష్టపడ్డాను’ అల్లరి నరేష్‌తో ‘పెళ్లికాని ప్రసాద్’ వంటి సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో సుమారు 15 సినిమాలకు పైగా శ్రీదేవి నటించింది. శ్రీదేవి తల్లి అలనాటి నటి మంజుల మూడేళ్ల కిందట హఠాత్తుగా చనిపోయిన సంగతి తెలిసిందే.

MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget