Halloween Costume ideas 2015
Latest Post

8:40:00 AM


ఇటీవల ‘సర్దార్‌’గా తెరమీదికొచ్చిన పవన్ తాజాగా ‘అ.ఆ..’ సెట్లో తళుక్కుమన్నారు. నితిన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. నితిన్ సహా ఇతర కీలక పాత్రధారులపై హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్‌లోకి పవన్ రావడం పట్ల ‘అఆ’ హీరో పవన్ అభిమాని అయిన నితిన్, దర్శకుడు త్రివిక్రమ్ సంతోషం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్‌, ఇతర కాస్ట్ అండ్ క్రూతో కాసేపు పవన్ ముచ్చటించడం పట్ల చిత్ర బృందం ఖుషీగా ఉందని హీరో నితిన్ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా మే 6 విడుదల కానున్న సంగతి తెలిసిందే.

8:28:00 AM
మలయాళ చిత్రం ‘ప్రజాపతి’ (2006) సినిమాతో తెరంగేట్రం చేసిన అదితీ రావు హైదరీ అటుపై బాలీవుడ్ పయనమై ‘రాక్‌స్టార్’, ‘వజీర్’, ‘ఫితూర్’ తదితర సినిమాలతో నటిగా చక్కటి గుర్తింపు తెచ్చకుంది. తాజాగా ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం సినిమాలో అవకాశం అందుకుందట ఈ హైదరాబాదీ. ‘ఓకే బంగారం’ తర్వాత కార్తి - మణిరత్నం కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తి సరసన నటించేందుకు పలువురు భామల పేర్లు పరిశీలనకు వచ్చినా కడకు ఈ అవకాశం అదితిని వరించిందట. దీంతో హీరోయిన్ల వేటకు తెరపడినట్టే. జూన్ మొదటివారంలో సినిమా షూటింగ్ మొదలవనుంది.

MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget