Halloween Costume ideas 2015
[ads-post]

మా వాళ్ల ఫంక్షన్‌లో మీ వాళ్ల గోలేంటి?


 

‘నీహా నువ్వు ఏ పని చేపట్టినా,ఆనందం లభిస్తుందని ఆశిస్తున్నా’’ అని నీహారికకు ముందుగా శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్. పనిలో పనిగా ఇటీవల వచ్చిన వివాదం గురించి తన వివరణ కూడా ఇచ్చారు. ఆ మధ్య విజయవాడలో ‘సరైనోడు’ థ్యాంక్స్ మీట్‌లో ఫ్యాన్స్ ‘పవర్ స్టార్.. పవర్ స్టార్’ అని అరవడం, ‘నేను చెప్పను బ్రదర్’ అని బన్నీ అనడం తెలిసిందే. ఈ మధ్య ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ఈ విషయం గురించి ప్రస్తావిస్తే, ‘ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం’ అన్నారు బన్నీ.

  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన బన్నీ ఈ విషయం గురించి ఆడియో వేడుకలో వివరణ ఇస్తూ, ‘‘మీరు ప్రతీసారి పవర్‌స్టార్ అని అరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోవడానికి కారణం పవర్‌స్టార్ కాదు. మీరే. కొంత మంది అభిమానులు పబ్లిక్ ఫంక్షన్ పెట్టినప్పుడు పవర్‌స్టార్ అని అరుస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు’’ అని బన్నీ అన్నారు. ‘‘ఇలాంటి ఫంక్షన్‌కు వచ్చినప్పుడు సినిమాకు సంబంధించినవాళ్ళు పర్సనల్‌గా ఏదో చెప్పుకోవాలనుకుంటారు.

  కానీ మీరు ‘పవర్‌స్టార్’, ‘పవర్‌స్టార్’ అని అరిచి వాళ్లను డిస్టర్బ్ చేయడంతో వాళ్లు యాంత్రికంగా మాట్లాడి వెళ్ళిపోతారు. అంతవరకూ ఎందుకు? ఓ పెద్ద డెరైక్టర్ సినిమా తీసి మాట్లాడుతుంటే, అక్కడ పవన్‌కల్యాణ్ అని అరిచారు. అయినా వేరే హీరో ఫంక్షన్స్‌లో మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఎందుకని నా ఫీలింగ్. ఇదే విషయాన్ని నాకు బాగా తెలిసిన వ్యక్తి ‘మా వాళ్ల ఫంక్షన్‌లో మీ వాళ్ల గోలేంటి’ అని అడిగారు.

  చాలా బాధ అనిపించింది. మన పాటల వేడుకల్లో అల్లరి చేయండి.. తప్పు లేదు. కానీ, వేరే హీరోల వేడుకల్లో కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. తానింత స్థాయికి రావడానికి కారణం చిరంజీవిగారే అని పవన్‌కల్యాణ్‌గారే చాలాసార్లు చెప్పారు. కానీ, చిరంజీవిగారు మాట్లాడుతున్నప్పుడు ‘పవర్‌స్టార్’ అని అరిస్తే ఆయనకెంత ఇబ్బందిగా ఉంటుందో? అప్పటినుంచి నేను పవన్‌కల్యాణ్‌గారి గురించి మీరెంత అడిగినా మాట్లాడకూడదని డిసైడయ్యాను.

 మీరు నా వల్ల బాధపడుంటారని తెలుసు. కానీ, మీ వల్ల  మా ఫ్యామిలీ చాలాసార్లు హర్ట్ అయింది. నేను ఒక వివాదాన్ని తప్పించుకోవడానికి మీడియా ముందు మాట్లాడ లేదు. కానీ అదే పెద్ద వివాదమైంది. నాకు పవన్‌కల్యాణ్ అంటే ఇష్టమే. చిరంజీవిగారి తర్వాత నన్ను ప్రోత్సహించింది ఆయనే.  చాలా రోజులుగా సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోయి మాటల యుద్ధంలోకి దిగారు. ప్లీజ్.. దీన్ని ఆపండి. మీరందరూ సోషల్ మీడియాలో గ్రూప్‌లు కావచ్చు. కానీ మేమందరం ఓ ఫ్యామిలీ. దయచేసి ఇక నుంచి ఇలాంటివి చేయద్దు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు బన్నీ.
Labels:

Post a Comment

MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget