ఐపీఎల్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య అప్పుడప్పుడూ గొడవలు మామూలే. ఐతే ఆదివారం ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. పుణెతో మ్యాచ్ సందర్భంగా ముంబయి ఆటగాళ్లు హర్భజన్, రాయుడు ఆవేశకావేశాలకు లోనయ్యారు. హర్భజన్ వేసిన 11వ ఓవర్లో సౌరభ్ మిడ్‌వికెట్ దిశగా కొట్టిన బంతిని రాయుడు బౌండరీ దగ్గర ఆపడానికి విఫలయత్నం చేశాడు. అతను డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. ఐతే బంతి బౌండరీకి వెళ్లడంతో హర్భజన్.. రాయుడి వైపు ఆగ్రహంగా చూస్తూ తిట్టాడు. దీంతో రాయుడికి ఒళ్లుమండింది. ఎందుకలా తిడుతున్నావ్ అంటూ కోపంగా అతడివైపు దూసుకొచ్చాడు. దీంతో భజ్జీ కొంచెం ఆవేశం తగ్గించుకుని అతడి దగ్గరికెళ్లి సముదాయించే ప్రయత్నం చేశాడు. కానీ రాయుడు శాంతించలేదు. హర్భజన్ చేతిని విదిలించుకుంటూ కోపంగా వెళ్లిపోయాడు.
రాయుడు హర్భజన్ ఎందుకు గొడవ పడ్డారు ?

Post a Comment