Halloween Costume ideas 2015
[ads-post]

'సుప్రీం' తెలుగు సినిమా రివ్యూ

 


సినిమా: సుప్రీమ్‌ బ్యాన‌ర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: సాయి ధ‌ర‌మ్‌తేజ్, రాశీఖ‌న్నా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, 30 ఇయ‌ర్స్ పృథ్వి, ఆలీ, పోసాని, సాయికుమార్, క‌బీర్‌సింగ్‌ త‌దిత‌రులు
సంగీతం: సాయి కార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీరామ్‌
నిర్మాత‌: దిల్ రాజు
క‌థ‌-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: అనిల్ రావిపూడి


సుప్రీం కథ అనంతపురంలోని జాగృతి సెంట్రల్ ట్రస్ట్ చుట్టూ తిరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఆ ట్రస్ట్ ను, ట్రస్ట్ కు చెందిన వేల ఎకరాల పంట భూమిని నమ్ముకొని పదిహేను వేల మంది రైతులు బతుకుతుంటారు. ఆ ట్రస్ట్ భూముల మీద కన్నేసిన ఇండస్ట్రియలిస్ట్ విక్రమ్ సర్కార్(కబీర్ దుహాన్ సింగ్) దొంగ డాక్యుమెంట్లతో ట్రస్ట్ ను సొంతం చేసుకోవాలనుకుంటాడు. విక్రమ్ సర్కార్ దౌర్జన్యంపై ట్రస్ట్ వ్యవహారాలు చూసే నారాయణరావు(సాయి కుమార్) కోర్టుకెళతాడు. ఆ ట్రస్ట్ కు చెందిన వారసుడిని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను తీసుకువస్తే ట్రస్ట్ ఆస్తులను పేద రైతులకు అప్పగిస్తామంటూ, వారసుడిని తీసుకురావడానికి నెల రోజుల గడువు ఇస్తుంది కోర్టు.తన ట్యాక్సీకి సుప్రీం అని పేరు పెట్టుకున్న క్యాబ్ డ్రైవర్ బాలు( సాయిధరమ్ తేజ్). రోజూ ట్యాక్సీ నడపడం, తన తండ్రి తాగి పడిపోతే ఇంటికి తీసుకొచ్చి సేవలు చేయటం తప్ప పెద్దగా ఆశలు, ఆశయాలు లేని సాదాసీదా కుర్రాడు. అలాంటి బాలు ఆ ఏరియాకు ఎస్ ఐగా వచ్చిన బెల్లం శ్రీదేవి(రాశీఖన్నా)తో ప్రేమలో పడతాడు. ప్రేమ కథ అలా నడుస్తుండగానే బాలుకి ఓ ఎనిమిదేళ్ల అనాథ కుర్రాడు రాజన్(మైఖేల్ గాంధీ) పరిచయం అవుతాడు. బాలుకి పరిచయం అయిన రాజన్ ఎవరు..? ఆ కుర్రాడి మూలంగా బాలు జీవితం ఎలా మారిపోయింది...? జాగృతి సెంట్రల్ ట్రస్ట్ గొడవలోకి బాలు ఎందుకు వచ్చాడు...? అన్నదే మిగతా కథ.

విశ్లేష‌ణ‌:
ఇలాంటి క‌థ‌లు గ‌తంలో చాలానే వ‌చ్చాయి. స్టోరీ కూడా మ‌న‌కు ముందే తెలిసిపోతుంది. అయితే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమా కథ‌ను న‌డిపించిన విధానం మాత్రం సూప‌ర్బ్‌గా ఉంది. సినిమా ఎలాంటి బోర్ లేకుండా హాయిగా సాగిపోతుంది. పైగా కామెడీ..సెంటిమెంట్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయి. సాయిధరమ్ తేజ్ నటన చాలా బాగుంది. ఇంత కాలం అందాల అరబోతకే పరిమితం అయిన రాశిఖన్నా ఈ సినిమాలో పోలీసు పాత్ర చేసి..మెప్పించింది. సాయిధరమ్ తేజ్ మరోసారి పాటల్లో మంచి డ్యాన్స్ లు చేసి మెప్పించాడు. దర్శకుడు ఎక్కడా క్లోజప్ షాట్స్ లేకుండా..సాయిధరమ్ తేజ్ నటననే హైలైట్ చేసి సక్సెస్ సాధించాడని చెప్పొచ్చు. చిరంజీవి సినిమాలో అందం హీందోళం పాట రీమిక్స్ లో కొద్ది పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా మెరుస్తారు. బెల్లం శ్రీదేవి పాట‌లో రాశీఖ‌న్నా సూప‌ర్బ్‌గా ఉంది. ఐటెం సాంగ్‌లో శృతీసోథి ఆక‌ట్టుకుంది.
ఇక మిగిలిన వారిలో పృధ్వీ, సిద్ధప్ప శీను కాస్ట్ లీ కార్లు దొంగతనం చేసే తీరు..వాళ్ళ మేనరిజం ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. డాక్టర్ గా అలీ పాత్ర కొద్దిసేపు ఉన్నా..ఓ ఎక్స్ రేలో ఇలియానా ఫోటో వచ్చేలా పెట్టి కడుపుబ్బ నవ్వించారు. రాజవంశానికి చెందిన కుర్రోడిని కాపాడి..ఎలా అనంతపురం గ్రామంలోని భూములను ఆ రైతులకు దక్కేలా చేస్తాడనే కథపై సాగిన సినిమా మొత్తం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా…సాగిపోగా..సెకండ్ హాఫ్ అన్నీ సమపాళ్ళలో పెట్టి నడిపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన ఖాతాలో ఓ హిట్ వేసుకోవటంతోపాటు..హీరో సాయి ధరమ్ తేజ్ కు హిట్ ఇచ్చాడనే చెప్పొచ్చు.

సాంకేతిక నిపుణులు :
పటాస్ సినిమాలో పర్ఫెక్ట్ కామెడీతో పాటు మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి, సుప్రీంలో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాడు. ఎంటర్ టైన్మెంట్ పరంగా ఓకె అనిపించినా పటాస్ స్థాయిలో మెప్పించటంలో మాత్రం తడబడ్డాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తాయి.  సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి బాగుంది. సాంగ్స్ తో పాటు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే చేజ్ సీన్స్ విజువల్ గా ఆకట్టుకున్నాయి. సాయి కార్తీక్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. రీమిక్స్ చేసిన అందం హిందోళం పాట తప్ప వేరే ఏ పాట థియేటర్ నుంచి బయటకు వచ్చాక తిరిగి గుర్తుకు వచ్చేలా లేదు.

ప్ల‌స్‌లు:
క‌థ‌నం
కామెడీ
సాయిధ‌ర‌మ్ ఎన‌ర్జిటిక్ యాక్టింగ్‌
ర‌న్ టైం
యాక్ష‌న్ సీన్స్‌ 

 మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్
సంగీతం
Labels:

Post a Comment

MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget