చిత్రం : బ్రహ్మోత్సవం
బ్యానర్: మహేష్ బాబు ఎంటర్‌టేన్‌మెంట్, పి.వి.పి సినిమా
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మహేష్ బాబు, ప్రసాద్ వి పోట్లురి
మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ J మెయెర్
విడుదల తేది : May20, 2016
టాలీవుడ్‌లో శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్‌బాబు నెంబర్ వన్ ప్లేస్‌కు
వచ్చేశాడు. ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ బాహుబలి తర్వాత
రికార్డులు, వసూళ్ల పరంగా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. నాన్ బాహుబలి
సినిమాల పరంగా చూస్తే శ్రీమంతుడే టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. రూ.160 కోట్ల
వసూళ్లు కొల్లగొట్టిన శ్రీమంతుడు మహేష్ ఇమేజ్‌ను ఆకాశంలో ఉంచింది.
శ్రీమంతుడు తర్వాత మహేష్ నటించిన సినిమా బ్రహ్మోత్సవం.
సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి కంప్లీట్ ఫ్యామిలీ
ఎంటర్‌టైనర్‌ను మహేష్‌కు ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో
వస్తున్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ.100 కోట్ల టోటల్ ఫ్రీ రిలీజ్
బిజినెస్ చేసింది. పీవీపీ బ్యానర్‌ఫై తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు
తారాస్థాయిలో ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ
సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ
సినిమాపై ఉన్న అంచనాలు అందుకుందా లేదా అన్నది డెక్కన్‌రిపోర్ట్.కామ్
సమీక్షలో చూద్దాం.
కథనం-విశ్లేషణ:
సినిమా మొదలు ఏడు కొండలవాడు
వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవం తో మొదలవుతుంది.అక్కడ సమంత ఎంటర్
అవుతుంది.అందరూ కలసి ఇలా పండగలా ఉంటే ఎంత భాగుంటుంది అంటుంది.కట్ చేస్తే
హీరో మహేష్ బాబు ఎంటర్ అవుతాడు తండ్రికి చెప్పులు వీసే సీన్ .ఆ తరవాత తన
తల్లి తండ్రులను తీసుకోని ఒక ఫంక్షన్ ని వెళతాడు. అక్కడ మొదటి సాంగ్
వచ్చిందడి సంతోషం పాట ఉంటుంది. ఒక ఇంట్లో సాంగ్ ఇది.మొత్తం ఫ్యామిలీ
మెంబెర్స్ అందరూ ఉంటారు.పాట చాల భాగుంది.
జయసుధ ఆమె భర్త రావు రమేష్ మహేష్ కి
మామయ్యా వరస అవుతాడు.రావు రమేష్ మొఖంలో ఆనందం ఉండదు.రావుగోపాల రావు ఫోటో లో
నుంచి రావు రమేష్ తో అంటే కొడుకుతో మాట్లాడే సీన్ పెట్టారు.ఇది బాగా
పండింది .కాజల్ ఎంట్రెన్సు ఎయిర్ పోర్ట్ లో అవుతుంది.అమెరికా నుంన్చి
వస్తుంది. సుభలేఖ సుధాకర్ ఆమె తండ్రి.సుభలేఖ సుధాకర్ మహేష్ బాబు ఫాదర్
పెయింటింగ్ కంపెనీ లో వర్క్ చేస్తూ ఉంటారు. రెండవ పాట కాజల్ ఇంట్లో
పచ్చళ్ళు పెడుతూ నాయుడోలు ఇంటికాడ అంటూ పాట ఉంది. ఇందులో కాజల్ ,ప్రణీత
ఇద్దరు హీరొయిన్ లు కూడా ఉన్నారు. ఈ పాట కూడా సూపర్.
మహేష్ బాబు వాళ్ళ తాతయ్య అంటే రేవతి ఫాదర్
,మహేష్ బాబు తండ్రికి నాలుగు వందల రూపాయలు ఇస్తాడు.దానిని పెట్టుబడిగా
పెట్టి కంపెని స్టార్ట్ చేసి అందులో చుట్టాలందరూ షేర్ హోల్డర్స్ గా
ఉంటారు.ఇప్పుడు ఆ కంపనీ ని నాలుగు వందల కోట్లకి కొనడానికి వస్తారు.దానిని
రావు రమేష్ అమ్మేద్దామంటాడు .మహేష్ ఫాదర్ ఈ విచారంలో ఉండగా ,మహేష్ బాబు
బ్రహ్మోత్సవం లో శ్రీనివాసుడు పద్మావతి పెళ్లి చూపులంటూ ఒక ఫంక్షన్ ఏర్పాటు
చేస్తాడు .అందులో ఒకవైపు కాజల్ కొంత ఫ్యామిలీ మెంబెర్స్ ,మరో వైపు మహేష్
ఇంకొంత ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు.శ్రీనివాసుడు పద్మావతి పెళ్లి చూపులు
సీన్ చాల భాగా పండించారు .మహేష్ కాజల్ కి అట్రాక్ట్ అవుతాడు .3 వ సాంగ్
త్రిపుర పాట ఇక్కడ ఉంటుంది.ఈ పాట కూడా హిట్.
ఫ్లస్(+)లు:– మహేష్‌బాబు యాక్టింగ్
– సినిమాటోగ్రపీ
– పీవీపీ నిర్మాణ విలువలు
మైనస్(-)లు:
– ఫస్టాఫ్
– సెకండాఫ్
– బోరింగ్ స్ర్కీన్ ప్లే
-డెడ్ స్లో నెరేషన్
– వీక్ డైరెక్షన్
– అర్థం లేని సీన్లు
– పాటల ప్లేస్‌మెంట్
– 1960వ దశకం నాటి స్టోరీ
Post a Comment