Halloween Costume ideas 2015
[ads-post]

ఒక్క అమ్మాయి త‌ప్ప‌ సినిమా : రివ్యూ


 
సినిమా: ఒక్క అమ్మాయి త‌ప్ప‌
న‌టీన‌టులు: స‌ందీప్ కిష‌న్‌, నిత్యామీన‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు
సంగీతం: మిక్కీ జే మేయ‌ర్‌
ఎడిటింగ్‌: గౌతంరాజు
నిర్మాత‌: అంజిరెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: రాజ‌సింహా (తొలి ప‌రిచ‌యం)
రిలీజ్ డేట్‌: 10 జూన్‌, 2016
కథ
ఈ.రవి ( సుమంత్ అశ్విన్), పోలీస్ కావాలనుకుని ఆర్టీసీ కండక్టర్ అవుతాడు. ఉత్తరాంధ్ర లో కొండ ప్రాంత్రాల్లోని గవిటి అనే ఊరికి నడిచే ఏకైక బస్సుకి మనోడు కండక్టర్. అదే బస్సుకి శేషు ( కాలకేయ ప్రభాకర్) డ్రైవర్ గా ఉంటాడు. ఉదయం సిటీ నుండి బస్సు ఊరికి  వెళ్తే, నైట్ హాల్ట్ చేసి మళ్ళీ తెల్లారి సిటీకి వస్తుంది. అందుకని వీరిద్దరూ ఆ గవిటి గ్రామంలొనే ఒక గది తీసుకుని ఉంటుంటారు. ఆ బస్సులో సిటీకి వెళ్లి ఉద్యోగం చేసే కళ్యాణి అనే అమ్మాయితో రవి లవ్ లో పడతాడు. అదే ఊరి సర్పంచ్ విశ్వనాథం (నాజర్) , కొడుకు దేవా సూరత్ లో ఉద్యోగం చేస్తుంటాడు. విశ్వనాథం ఇంట్లో చిన్నప్పటి నుండి  పెరిగిన అమృత తో దేవాకు పెళ్లి చేయాలనుకుంటాడు. భద్ర (వినోద్ కిషన్)అనే అనాధని విశ్వనాథం చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. అతను ఊరిలో చిన్నచిన్న పనులు చేస్తూ అందరికీ సహాయకారిగా ఉంటాడు. డ్రైవర్ శేషుకు తాగుడు వ్యసనం ఉంటుంది. ఒక రోజు బస్ బ్రేక్ డౌన్ అవుతుంది. పాసింజర్స్ ను దించేసి, బస్సు రిపేరు చేయించుకుని బయలుదేరతారు. అదే రోజు తన చెల్లెలి పెళ్లి కుదిరింది అనే సంతోషం లో ఫుల్లుగా మందు కొట్టి డ్రైవ్ చేయలేని స్థితిలో ఉన్న శేషు, కండక్టర్ రవిని బస్సు నడపమని చెప్తాడు. అలా రవి బస్సు నడుపుతుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి బస్సుకు గుద్దుకుని పడిపోతాడు. తాము యాక్సిడెంట్ చేసామని జనం అనుకుంటారనే భయంతో, ఒక జీప్ లో అతన్ని ఆసుపత్రికి పంపించేసి వీళ్ళిద్దరూ రూమ్ కి వెళ్ళిపోతారు. ఆ తర్వాతి రోజు ఆసుపత్రికి వెళ్తే అసలు యాక్సిడెంట్ కేసులే రాలేదని తెలుస్తుంది. ఇంతకీ బస్సు గుద్దుకుని పడిపోయిన వ్యక్తే విశ్వనాథం కొడుకు దేవా. తర్వాత దేవా చనిపోయాడని తెలుస్తుంది. దేవా ఎందుకు చనిపోయాడు? ఎవరు చంపారు? టాక్సీ డ్రైవర్ కి దేవా కి ఏంటి సంబంధం లాంటి ప్రశ్నలకి సమాధానం సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది.
ప్లస్ పాయింట్లు:
కాన్సెప్ట్‌, సందీప్‌ కిషన్‌, నిత్యామీనన్

మైనస్ పాయింట్స్:
కథలో లాజిక్ లేకపోవటం, ఫస్ట్ ఆఫ్

Labels:

Post a Comment

MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget