Halloween Costume ideas 2015
Latest Post

9:30:00 AM
 
 రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల పవన్ ఏపీకి 'ప్రత్యేక హోదా' విషయంలో పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరఫున ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ ఎంపీలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. పవన్ విన్నపాన్ని ఎద్దేవా చేస్తూ రామ్ గోపాల్ వర్మ మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.

'విజ్ఞప్తి కాదు.. డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది. ఫ్లాపైనా మాకు గబ్బర్ సింగ్ కావాలిగానీ.. బెగ్గర్ సింగ్ కాదు. అసలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదు.. రియల్ స్టార్ కేటీఆర్' అంటూ ఘాటైన కామెంట్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ కు, రామూకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజా కామెంట్లతో రామూ మరోసారి పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టినట్లయ్యింది.

9:00:00 AM



ఐపీఎల్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య అప్పుడప్పుడూ గొడవలు మామూలే. ఐతే ఆదివారం ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. పుణెతో మ్యాచ్‌ సందర్భంగా ముంబయి ఆటగాళ్లు హర్భజన్‌, రాయుడు ఆవేశకావేశాలకు లోనయ్యారు. హర్భజన్‌ వేసిన 11వ ఓవర్లో సౌరభ్‌ మిడ్‌వికెట్‌ దిశగా కొట్టిన బంతిని రాయుడు బౌండరీ దగ్గర ఆపడానికి విఫలయత్నం చేశాడు. అతను డైవ్‌ చేసినా ఫలితం లేకపోయింది. ఐతే బంతి బౌండరీకి వెళ్లడంతో హర్భజన్‌.. రాయుడి వైపు ఆగ్రహంగా చూస్తూ తిట్టాడు. దీంతో రాయుడికి ఒళ్లుమండింది. ఎందుకలా తిడుతున్నావ్‌ అంటూ కోపంగా అతడివైపు దూసుకొచ్చాడు. దీంతో భజ్జీ కొంచెం ఆవేశం తగ్గించుకుని అతడి దగ్గరికెళ్లి సముదాయించే ప్రయత్నం చేశాడు. కానీ రాయుడు శాంతించలేదు. హర్భజన్‌ చేతిని విదిలించుకుంటూ కోపంగా వెళ్లిపోయాడు.

8:32:00 AM
 
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌పై సినీనటి మాజీ ప్రియురాలు కత్రినాకైఫ్‌ ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్రెజిల్‌లోని రియో డి జెనిరియాలో జరిగే ఒలింపిక్స్‌కు భారత్‌ జట్టుకు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సల్మాన్‌ ఎంపిక అంశంపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.ఈ వివాదంపై స్పందించాలని కత్రినాను కోరగా.. ‘‘బజరంగీ భాయ్‌జాన్‌’ హీరోకు వివాదాలేమి కొత్త కాదు’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది.

 సల్మాన్‌ఖాన్‌ ఎంపికను 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం విజేత యోగేశ్వర్‌ దత్‌, మిల్కాసింగ్‌ వంటివారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సల్మాన్‌కు క్రీడల్లో పాత్ర ఏమైనా ఉందా? ఆయనను రియో ఒలింపిక్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేయడంలో ఆంతర్యమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. 

 సల్మాన్‌ఖాన్‌ ఎంపికను ప్రముఖ బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ హేమమాలిని ఇంకొందరు సమర్దిస్తున్నారు

10:39:00 PM


 

సర్దార్గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ చేస్తున్నది తమిళ రీమేకా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతంఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్రం పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. కాగా, అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన 'వీరమ్' చిత్రం ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారని అంటున్నారు. చిత్రం రీమేక్ హక్కులను పవన్ ఎప్పుడో తీసుకున్నారని, దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారని చెబుతున్నారు. పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఒరిజినల్ లో లేని కొత్త సన్నివేశాలను కూడా జొప్పిస్తున్నారట. యాక్షన్ లవ్ స్టోరీగా ఇది తెరకెక్కుతుంది.

MKRdezign

{facebook#https://www.facebook.com/Thevideohive-112627722477744/} {google-plus#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget